మెగా బ్లాక్ బస్టర్ రీమేక్‌లో రాంచరణ్.. రాజమౌళి సినిమా తరువాత అదే!

1991 లో వచ్చిన గ్యాంగ్ లీడర్ చిత్రం మెగాస్టార్ చిరంజీవి బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. 90 లలో యువతని ఈ చిత్రం ఉర్రూతలూగించింది. చిరంజీవి డైలాగ్ డెలివరీ, మాస్ యాక్షన్ అంశాలు, ఫ్యామిలీ సెంటిమెంట్, విజయ శాంతి తో రొమాన్స్ ఇలా అన్ని అంశాలు ప్రేక్షకులని అలరించాయి.

జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాలని మెగా పవర్ స్టార్ రాంచరణ్ రీమేక్ చేయాలని మెగా అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కానీ ఆ సాహసం రాంచరణ్ ఇంత వరకు చేయలేదు. ఆ దిశగా తొలిసారి అడుగులు పడ్డట్లు వార్తలు వస్తున్నాయి.

 Gang Leader Remake In Creative Commercials

ఇటీవల తేజ్ ఐ లవ్ యూ ఆడియో వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. కె ఎస్ రామారావు నిర్మాణంలో రాంచరణ్ త్వరలో నటిస్తాడని ప్రకటించారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో నటించడానికి స్వయంగా రాంచరణ్ ఆసక్తి చూపినట్లు చిరంజీవి తెలిపారు. ఈ కాంబినేషన్ లో రాబోయే చిత్రం గ్యాంగ్ లీడర్ రీమేకే అని వార్తలు వస్తున్నాయి. ఆ దిశగా కథని సిద్ధం చేయించేందుకు కె ఎస్ రామారావు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ మల్టి స్టారర్ చిత్రంలో నటించబోతున్నాడు. ఆ చిత్రం పూర్తయ్యాక గ్యాంగ్ లీడర్ రీమేక్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X