రచ్చలో చిరంజీవి గ్యాంగ్‌లీడర్ టైటిల్ సాంగ్‌ని రీమిక్స్
రామ్ చరణ్ తాజా చిత్రం 'రచ్చ' లో చిరంజీవి గ్యాంగ్‌లీడర్‌లోని టైటిల్ సాంగ్‌ని రీమిక్స్ చేస్తున్నారు. మెగా సూపర్‌గుడ్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్ నిర్మిస్తున్నఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఏమైంది ఈ వేళ చిత్రంతో దర్శకుడుగా మారిన సంపత్ నంది ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు.ఈ చిత్రం కోసం ఇటీవల హైదరాబాద్‌లో ముఖ్య సన్నివేశాల్ని షూట్ చేసారు.అలాగే ఈ సినిమా కోసం కళా దర్శకుడు ఆనంద్‌సాయి ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దారు.
త్వరలో శ్రీలంకలో చిత్రీకరణ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.జూలై 3 వ తేదీ నుంచి అక్కడ హీరో,హీరోయిన్స్ పై పాటను షూట్ చేస్తారు. వందశాతం మాస్ చిత్రమిదని,కమర్షియల్ అంశాలతో కూడిన చరణ్ పాత్ర తప్పకుండా అన్ని వయసులవారికీ నచ్చుతుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: ఆర్.బి.చౌదరి, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి.


Click it and Unblock the Notifications











