హిందీ సినిమాలో ....'గ్యాంగ్ లీడర్' ట్రాక్

ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్ద హిట్టుగా నిలిచిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా చేసింది. ఇక ఈ సినిమా కాన్సెప్టు 'నువ్వే కావాలి' కి కాపీగా కనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ 'తొలిప్రేమ' ని గుర్తుచేస్తుంది. ఇక 'గుడుంబా శంకర్' లోని మీరాజాస్మిన్ కి ఎయిడ్స్ అని చెప్పి పవన్ కళ్యాణ్ రౌడీలనుంచి ఆమెను రక్షించే సీన్ ఈ సినిమాలో కాపీ గా మారి హైలట్ గా నిలిచింది. వీటన్నిటికీ మించి 'గ్యాంగ్ లీడర్' లోని చిరంజీవి ఫొటో సీను అక్కడ వారికి బాగా నచ్చుతోందిట.
ఇక ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కామిడీగా అక్కడ మొదటి వారంలోనే రికార్డు స్ధాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో ఇమ్రాన్ నటన కన్నా జెనీలియా అభినయ విన్యాసాలకే ఎక్కువ మార్కులు పడ్డాయి. రచయిత, దర్శకుడు అయిన అబ్బాస్ తైరివాలా ఈ స్క్రిప్టు ని పూర్తి ఫన్ తో నింపి ధియోటర్లు లను నవ్వులతో నింపుతున్నాడు. యేదైమైనా చిరు అప్పట్లో చేసిన సన్నివేశాలు ఇప్పటికీ వన్నె కోల్పోకుండా వలస వెళ్ళటం గ్రేటే కదా.


Click it and Unblock the Notifications











