ఢిల్లీ రేప్ : సినీతారల నిరసన ప్రదర్శన(ఫోటోలు)
ముంబై : ఢిల్లీ రేప్ ఘటనపై బాలీవుడ్ సినీతారలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గ్యాంగ్ రేప్ ఘటనను వ్యతిరేకిస్తూ ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించడంతో పాటు, మృతురాలి ఆత్మక శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు హేమామాలిని, జయబచ్చన్, దీపిక పడుకొనె, మందిరా బేడీ, జెనీలియా తదితరులు పాల్గొన్నారు.
అదే విధంగా పలువురు టాలీవుడ్ తారలు కూడా రేప్ సంఘటనపై ట్విట్టర్ ద్వారా నిరసనలు వ్యక్తం చేయడంతో పాటు, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అదే విధంగా దోషులను ఉరితీయాలని డిమాండ్ చేసారు. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించడానికి సిద్ధం అవుతున్నారు.
ఢిల్లీ గ్యాంగ్‌రేప్ బాధితురాలు సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది అత్యంత విషాదకరమైన సంఘటన ఇదే. మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచింది. పక్షం రోజుల క్రితం ఢిల్లీలోని ఓ బస్సులో 23 ఏళ్ల యువతి దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది.

నిరసన ప్రదర్శనలో పాల్గొన్న బాలీవుడ్ తారలు

నిరసన ప్రదర్శనలో పాల్గొన్న బాలీవుడ్ తారలు

.నిరసన ప్రదర్శనలో పాల్గొన్న బాలీవుడ్ తారలు

నిరసన ప్రదర్శనలో పాల్గొన్న బాలీవుడ్ తారలు

నిరసన ప్రదర్శనలో పాల్గొన్న బాలీవుడ్ తారలు

నిరసన ప్రదర్శనలో పాల్గొన్న బాలీవుడ్ తారలు

నిరసన ప్రదర్శనలో పాల్గొన్న బాలీవుడ్ తారలు

నిరసన ప్రదర్శనలో పాల్గొన్న బాలీవుడ్ తారలు

నిరసన ప్రదర్శనలో పాల్గొన్న బాలీవుడ్ తారలు

నిరసన ప్రదర్శనలో పాల్గొన్న బాలీవుడ్ తారలు

Click it and Unblock the Notifications