అక్టోబర్ 1న వెంకీ ‘గంగా ది బాడీగార్డ్’ ఆడియో!
వెంకటేష్ హీరోగా 'గంగా ది బాడీగార్డ్" సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వెంకీ సరసన త్రిష లీడ్ రోల్ చేస్తుండగా, సలోని ముఖ్య పాత్రలో కనిపించనుంది. సినీ వర్గాల నుంచి లేటెస్టుగా అందిన సమాచారం ప్రకారం అక్టోబర్ 1న సినిమా ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తూంది. అదే విధంగా అక్టోబర్ 26 సినిమాను ప్రక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దీపావళికి సినిమా మార్కెట్ వాటాను దక్కించుకోవడానికి ట్రై చేస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ శ్రీ సాయి గణేస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.
మళయాళ సూపర్ హిట్ సినిమా 'బాడీగార్డు" సినిమాకు ఇది రీమేక్. ఇప్పటికే సల్మాన్ ఖన్, కరీనా కపూర్ జంటగా నటించిన బాడీగార్డ్ హిందీ రీమేక్ సూపర్ హిట్ కలెక్షన్ లతో దూసుకెలుతోంది. తమిళంలోనూ ఈ సినిమా రీమేక్ అవుతోంది. కాగా...ఇటీవల సల్మాన్ నటించిన బాడీగార్డు సినిమా హిందీ వెర్షన్ ఆంద్రప్రదేశ్ లో భారీ ఫ్రింట్లో విడుదలై విజయవంతంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో అదే కథతో రాబోతోతున్న వెంకీ 'గంగా ది బాడీగార్డ్" చిత్రం పరిస్థితి ఏమిటీ అనేది ప్రశ్నాతర్థకంగా మారింది. మరి కన్నడ, హిందీలలో సక్స్ అయిన బాడీగార్డు తెలుగులో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనబోతున్నాడో? కొన్ని రోజుల్లో తేలనుంది.


Click it and Unblock the Notifications











