దీపావళికి ధూమ్ ధామ్ గా ముస్తాబవుతున్న ‘బాడీగార్డ్’
వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బాడీగార్డ్". శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. త్రిష, సలోని కథానాయికలుగా నటిస్తున్నారు. మలయాళంలో సిద్ధిఖ్ దర్శకత్వంలోసంచలన విజయం సాధించిన 'బాడీగార్డ్" చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర హిందీ రీమేక్ లో సల్మాన్ ఖాన్ నటించిన విషయం తెలిసిందే. ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన ఈ చిత్రం అక్కడ కూడా విజయవంతంగా ప్రదర్శింపబడుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దీంతో తెలుగు బాడీగార్డ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనివున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది.
భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్ బాడీగార్డుగా స్టెలిష్ పాత్రలో కనిపిస్తారు. ఈ పాత్ర కోసం వెంకటేష్ కొంచెం స్లిమ్ గా ముస్తాబయ్యారు. ఓ అమ్మాయికి, ఆమె అంగరక్షకుడికి మధ్య ఆసక్తికరమైన మలుపులతో నడిచే యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు మలినేని గోపిచంద్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. నెలాఖరుకు చిత్రీకరణ పూర్తికానుంది. అన్ని కార్యక్షికమాలు పూర్తిచేసి దీపావళికి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











