twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గంగ- ది బాడీగార్డు విడుదల తేదీ కన్ఫర్మ్

    By Srikanya
    |

    వెంకటేష్ హీరోగా గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న చిత్రం గంగ.. ది బాడీగార్డ్. ఈ చిత్రం నవంబర్ 24న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. మళయాళంలో విడుదలైన బాడీగార్డుకి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు.త్రిష ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. సలోని మరో కీలకమైన పాత్రలో కనపించనుంది.ఇక ఆ మధ్య హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా ఈ చిత్రం రూపొందింది. ఈ విషయమై వెంకటేష్ మాట్లాడుతూ... నేను సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ చూసాను. సల్మాన్ అధ్బుతంగా చేసాడు. అయితే నా సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని భావించటం లేదు. ఎందుకంటే మేము మళయాళం నుంచి కేవలం కాన్సెప్టు మాత్రమే తీసుకుని,చాలా మార్పులు చేసాము. తెలుగు ప్రేక్షకులుకు నచ్చే విధంగా చాలా ఎలిమెంట్స్ కలిపాము అంటున్నారు వెంకటేష్. ఆయన్ని తాజాగా కలిసి మీడియా హిందీలో వచ్చిన బాడీగార్డు సినిమా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా చోట్ల రిలీజ్ అయ్యింది కదా దాని ఎఫెక్టు మీ సినిమా మీద పడదా అంటే ఆయన ఇలా స్పందించారు.

    ఇక వెంకటేష్ ఇంతకు ముందు బెల్లంకొండ నిర్మించిన నాగవల్లి చిత్రంలో చేసారు. అదీ రీమేకే కావటం విశేషం. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో వెంకటేష్ పూర్తిగా ఈ చిత్రం విజయం పైనే నమ్మకాలు పెట్టుకునే పరిస్ధితి ఏర్పడింది. అలాగే త్రిషకు కూడా ఈ చిత్రం కీలకమైందే.ఆమెకు ఇప్పుడు తెలుగులో ఒక్క చిత్రమూ లేదు. ఈ సినిమా హిట్టైతేనే ఆమెకు మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.గోపీచంద్ మలినేని కూడా ఈ చిత్రం తనకు రెండో చిత్రం గండం అవకుండా బయిటపడుతుందా లేదా అన్నట్లు చూస్తున్నాడు. మర్యాద రామన్న చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంబించిన సలోనికి కూడా ఇది విడుదలతై కాస్త కెరిర్ లో కదలిక వస్తుందని భావిస్తోంది. ఇక అదే రోజున నారా రోహిత్ సోలో కూడా విడుదల కానుందని సమాచారం.

    English summary
    Victory Venkatesh is coming up with ‘Ganga – The Bodyguard’ and the latest news in the industry is that the movie is gearing up to release on November 24th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X