For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సెలబ్రిటీకి ఇంట్లో ఉండే అర్హతే లేదు.. అందరి జాతకాలు గంగవ్వ బట్టబయలు, రాహుల్‌తో క్రేజీ ముచ్చట్లు

    |

    అనారోగ్య కారణాలతో బిగ్‌బాస్ ఇంటి నుంచి గంగవ్వ బయటకు రావడం అభిమానులు, ప్రేక్షకులు కొంత నిరుత్సాహానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఇంటి నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో గంగవ్వను బిగ్‌బాస్ పంపించాల్సి వచ్చింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన గంగవ్వను బిగ్‌బాస్ తెలుగు 4 విజేత రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో గంగవ్వ వెల్లడించిన అంశాలు ఏమిటంటే..

    అవినాష్ బాగా నవ్విస్తాడు..

    అవినాష్ బాగా నవ్విస్తాడు..

    గంగవ్వతో జరిగిన ర్యాపిడ్ రౌండ్‌లో గంగవ్వను కొన్ని ప్రశ్నలు అడిగారు. అడిగిన ప్రశ్నకు రెండు సమాధానాలు ఇస్తాను. ఠక్కున జవాబు చెప్పాలి అంటూ గంగవ్వకు రాహుల్ సిప్లిగంజ్ వివరించారు. ఇంటిలో అవినాష్, అమ్మా రాజశేఖర్‌లో ఏ ఇద్దరు బాగా నవ్విస్తారు? అనే ప్రశ్నకు అవినాష్ అంటూ గంగవ్వ ఠక్కున సమాధానం చెప్పారు.

    మోనాల్, అఖిల్ అఫైర్ గురించి

    మోనాల్, అఖిల్ అఫైర్ గురించి

    బిగ్‌బాస్ ఇంటిలో ఎవరి జంట బాగున్నది అనే ప్రశ్నకు గంగవ్వ సమాధానం ఇస్తూ అఖిల్, మోనాల్ గజ్జర్ అంటూ ఎలాంటి అనుమానం, సందేహం, మొహమాటం లేకుండా సమాధానం వెంటనే చెప్పారు. వారిద్దరిదే ఇంటిలో మంచి జంట అని చెప్పుకొచ్చింది.

     అఖిల్ అంటే నాకు ఇష్టం..

    అఖిల్ అంటే నాకు ఇష్టం..

    ఇక ఇంటిలో ఉన్నంత కాలం ఎవరితో ఉండటానికి ఇష్టపడ్డారు. అఖిల్, దివిలో ఎవరితో ఉండటానికి ఇష్టపడ్డారు అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. నాకు అఖిల్‌తో ఉండటమే ఇష్టం. అఖిల్‌తో ఎక్కువగా ఉండటానికి ఇష్టపడ్డాను. దివితో నాకు ఉండటం ఇష్టం ఉండదు అని గంగవ్వ అన్నారు.

     అఖిల్ నిజాయితీగా ఉండడు..

    అఖిల్ నిజాయితీగా ఉండడు..

    ఇక ఇంటిలో నిజాయితీగా.. ముఖానికి ముసుగు వేసుకోకుండా ఉండే సెలబ్రిటీ ఎవరు అనే ప్రశ్నకు గంగవ్వ నిజాయితీగా సమాధానం చెప్పారు. ఇంటిలో నిజాయితీగా ఉండేది కుమార్ సాయి. 100 శాతం నేచురల్‌గా, నిజాయితీగా, జెన్యూన్‌గా ఉంటారని గంగవ్వ పేర్కొన్నారు. అఖిల్ నాకు ఇష్టమైనా.. కొంత అసంతృప్తి ఉంది. అసలు టాస్కులు ఆడరు. గెలవడు. మనవడు అయినంత మాత్రన ఇష్టం కాకపోతే మెచ్చుకుంటామా? కుమార్ సాయి మాత్రం నిజాయితీగా ఆడుతాడు అని సమాధానం చెప్పగా.. గంగవ్వ ఈ సమాధానం ఊహించలేదు అంటూ రాహుల్ సిప్లిగంజ్ అన్నాడు. మనవడని, కాళ్లు ఒత్తాడని అఖిల్‌ను మంచోడని చెప్పను అని గంగవ్వ చెప్పింది.

    సోహైల్‌కు కోపిష్టి

    సోహైల్‌కు కోపిష్టి

    ఇక ఇంటి సభ్యుల్లో ఎవరికి కోపం ఎక్కువ అని రాహుల్ సిప్లిగంజ్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. కెప్టెన్ అయ్యిండు సూడు.. ఆయనకే కోపం ఎక్కువ అని గంగవ్వ చెప్పడం జరిగింది. ఇటీవల సోహైల్ ప్రవర్తన తీరుపై నాగార్జున కూడా మండిపడ్డారు. ప్రవర్తన మార్చుకోమని కొరడా చూపిస్తూ మందలించడం తెలిసిందే.

    Bigg Boss Telugu 4 : Gangavva Is Out Of Bigg Boss Game
    ఇంటిలో హారిక వేస్ట్

    ఇంటిలో హారిక వేస్ట్

    ఇక ఇంటిలో ఉండే సభ్యుల అర్హతకు సంబంధించిన ప్రశ్నను రాహుల్ సిప్లిగంజ్ అడిగారు. ఇప్పటి వరకు నీవు గమనించిన ప్రకారం.. నీకు అనిపించిన ప్రకారం.. ఏ సభ్యుడికి ఇంట్లో ఉండే అర్హత లేదో చెప్పండి అంటే.. హారిక అంటూ గంగవ్వ అనుమానంగా సమాధానం చెప్పింది. నీ మనసులో ఏముంటే అది చెప్పమని రాహుల్ అడిగితే.. ఆమెకు కోపం ఎక్కువ. ఎవరితో కలువదు. ఆమె లోకంలో ఆమే ఉంటుంది అని చెప్పుకొచ్చారు.

    English summary
    Contestant Gangavva leaves the bIgg boss Telugu 4 show due to health reason in 5th weekend. As part of the Rahul Sipligunj interview, Gangavva reveals Bigg Boss Telugu 4 contestants secrets, personal Issues.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X