గంగవ్వను అలా బంధించడమే శాపంగా మారిందా? లేకపోతే కథ మరోలా.. అవ్వ బయటకు రావడంపై..
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ నుంచి కంటెస్టెంట్ గంగవ్వ అనూహ్యంగా వెళ్లిపోవడం ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. మరి కొన్ని రోజులు ఇంటిలో కొనసాగుతారని భావిస్తున్న తరుణంలో గంగవ్వ అనారోగ్యంతో నిష్క్రమించడం ఇంటి సభ్యులను కంటతడి పెట్టింది. అయితే గంగవ్వ షో నుంచి తప్పుకోవడానికి కారణాలను గంగవ్వను తల్లికంటే ఎక్కువగా చూసుకొనే శ్రీకాంత్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు మీ కోసం...

గంగవ్వను సెలబ్రిటీగా మార్చింది
గంగవ్వలోని ప్రతిభను, ఉత్సాహాన్ని గమనించిన శ్రీకాంత్ ఆమెను యూట్యూబ్ మీడియాలోకి తీసుకొచ్చారు. గంగవ్వ సెలబ్రిటీగా మారడానికి, బిగ్‌బాస్ ద్వారా ప్రపంచానికి తెలియడానికి శ్రీకాంత్ కారణమయ్యాడు. ప్రస్తుతం గంగవ్వ యోగ క్షేమాలను చూసే వ్యక్తిగా, ఆమెకు సంబంధించిన ప్రతీ విషయంలో శ్రీకాంత్ వ్యవహరిస్తున్నారు.

మెడికల్ సదుపాయాలు, వైద్యులు అద్భుతంగా
గంగవ్వ గురించి శ్రీకాంత్ జాతీయ మీడియాకు చెందిన టీవోఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌లో పాల్గొనేమని గంగవ్వను చాలా రోజులుగా అడుగుతున్నారు. అయితే మేము అందుకు ఉత్సాహం చూపలేదు. ఈ సారి నిర్వాహకులు మమ్మల్ని సంప్రదించగా.. గంగవ్వను బిగ్‌బాస్‌కు పంపాలని డిసైడ్ అయ్యాం. అయితే వైద్యులు, మెడికల్ సదుపాయాలు అద్భుతంగా ఉండటం వల్ల మేము ఆమె విషయంలో ధైర్యం చేశాం అని శ్రీకాంత్ పేర్కొన్నారు.

గ్రామంలో సరదాగా తిరిగే అవ్వను..
గంగవ్వ జాలీగా తిరిగే వ్యక్తి. ఆమెను ఒక చోటు కట్టేసినట్టు లేదా బంధించినట్టు ఉంటే తట్టుకోలేదు. లంబాడిపల్లే గ్రామంలో కూడా ఆమె ఎప్పుడూ తిరుగుతూ, నలుగురితో మాట్లాడుతూ ఉండే వ్యక్తి. అయితే బిగ్‌బాస్‌లో వెళ్లడానికి ముందు కరోనా కారణంగా ఆమెను క్వారంటైన్‌లో పెట్టడం ఆమెకు చాలా ఇబ్బందిని కలిగించింది అని శ్రీకాంత్ చెప్పారు.

నాలుగు గోడల మధ్య బంధించడం
బిగ్‌బాస్‌లోకి గంగవ్వ వెళ్లడానికి ముందు ఓ స్టార్ హోటల్‌లో దాదాపు 20 రోజులపాటు ఆమెకు క్వారంటైన్ విధించారు. నాలుగు గోడల మధ్య బంధించడంతో ఆమెకు ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడింది. బిగ్‌బాస్ ఇంటిలోకి వెళ్లడానికి ముందే ఆమె పరిస్థితి కాస్త కష్టంగానే ఉంది. ఒకవేళ ఆమె క్వారంటైన్‌లో లేకుండా ఉండి ఉంటే మరికొంత కాలం ఇంటిలో ఉండేది. కేవలం ఓ గదిలో మూడు వారాలు ఉండటం గంగవ్వ ఆరోగ్యంపై ప్రభావం చూపింది అని జాతీయ మీడియాకు చెందిన వెబ్‌సైట్‌కు శ్రీకాంత్ తెలిపారు.
Recommended Video

గంగవ్వపై రూమర్లు సరికాదు.
బిగ్‌బాస్ తెలుగు 4లో పాల్గొనడానికి ముందు గత సీజన్‌కు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్‌ను క్వారంటైన్‌లో గంగవ్వ చూశారు. ఆమెకు నిర్వాహకులు ఎలాంటి ట్రైనింగ్ గానీ, ముందస్తు సూచనలు ఇవ్వలేదు. గంగవ్వకు ముందుగానే శిక్షణ ఇచ్చారని మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. చివరి రోజు వరకు కనిపించినది గంగవ్వ సహజ స్వభావం అని శ్రీకాంత్ చెప్పారు.


Click it and Unblock the Notifications











