నిర్మాత ఇంటిపై గ్యాంగస్టర్ కాల్పులు, ఉద్రిక్తం
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత అలీ మోరానీ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరుపడం బాలీవుడ్ పరిశ్రమను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న నిర్మాత ఇంటి వద్దకు బైక్‌పై చేరుకున్న ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఇంటిపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు.
శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. ముంబైకి చెందిన గ్యాంస్టర్స్ ఈ కాల్పులకు తెగబడ్డట్లు అనుమానిస్తున్నారు. నిందితులను గుర్తించాల్సి ఉంది. ఈ సంఘటనతో చాలా కాలం తర్వాత మళ్లీ బాలీవుడ్లో అండర్ వరల్డ్ మాఫియా భయం మొదలైంది. భయ పెట్టి వసూళ్లకు పాల్పడటంలో భాగంగానే ఇలా చేసినట్లు అనుమానిస్తున్నాు.

మాఫియా డాన్ రవి పుజారి గ్యాంగ్ నుండి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు అలీ మోరానీ అనుమానిస్తున్నారు. జుహు పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకుని విచారణ మొదలు పెట్టారు. వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.
మోరానీ బ్రదర్స్ అలీ, కరిమ్ కలిసి బాలీవుడ్లో పలు సక్సెస్ ఫుల్ చిత్రాలు నిర్మించారు. రాజా హిందుస్తానీ, దామిని, దుష్మనీ, హమ్‌కో తుమ్ సే ప్యార్ హై లాంటి చిత్రాలను మోరానీ బ్రదర్స్ నిర్మించారు.


Click it and Unblock the Notifications