పవన్ కల్యాణ్‌తో కలిసి వస్తున్న అలియా భట్.. వకీల్ సాబ్ రిలీజ్ కోసం సిద్దామవ్వండి అంటూ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మరికొన్ని గంటల్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతోంది. నెవర్ బిఫోర్ అనేలా రీ ఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్ కోసం కేవలం ఆడియెన్స్ అనే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాపై బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

మొదటి నుంచి కూడా
ఓ మై ఫ్రెండ్, MCA వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ హిట్ మూవీ పింక్ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక రీమేక్ సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ అంచనాల డోస్ ను మరింత పెంచేసింది.

నిమిషానికొక రికార్డు
సినిమా ట్రైలర్ రికార్డుల మోతతో సోషల్ మీడియాలో వివిధ రకాల హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండ్ క్రియేట్ చేయగా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నిమిషానికొక రికార్డు క్రియేట్ చేస్తున్న వకీల్ సాబ్ సందడి బాలీవుడ్ ఇండస్ట్రీలను కూడా ఎట్రాక్ట్ చేస్తోంది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యధిక లైవ్ వ్యూవ్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఇంత ఫాస్ట్ గా ఏ మూవీ కూడా రికార్డ్ అందుకోలేదు.
అలియా భట్ విషెస్
ఇక వకీల్ సాబ్ విడుదల సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ స్పందించింది. సినిమా విడుదలవుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి అలాగే వారి అభిమానులకు నిర్మాతకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు చెబుతూ ఫ్యాన్స్ సిద్దామవ్వండి అని వీడియో ద్వారా తెలియజేశారు.
Recommended Video

పవర్ స్టార్ తో గంగూ భాయ్
ఇక అలియా భట్ నటించిన గంగూబాయ్ కతియావాడి తెలుగు టీజర్ ను కూడా వకీల్ సాబ్ తో పాటు సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్ థియేటర్స్ లో టీజర్ ను విడుదల చేస్తున్నారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న ఆ సినిమాని సంజయ్ లీలా భన్సాలి డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా జూలై 30 న రిలీజ్ కాబోతోంది.


Click it and Unblock the Notifications











