twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సింహాచలంలో సూర్య, కార్తీ సందడి.. 'చినబాబు' ప్రెస్ మీట్‌లో దుమ్మురేపిన మంత్రి గంటా! (వీడియో)

    |

    Recommended Video

    సింహాచలంలో సూర్య, కార్తీ సందడి.. 'చినబాబు' ప్రెస్ మీట్‌లో దుమ్మురేపిన మంత్రి గంటా!

    హీరో కార్తీ నటించిన చినబాబు చిత్రం జులై 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత ఏడాది ఖాకి చిత్రంతో హిట్టు కొట్టిన కార్తీ ఈ ఏడాది చినబాబు చిత్రంతో రాబోతున్నాడు. రైతు సమస్యలపై రూపొందించిన చిత్రం ఇది. ఇటీవల విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కార్తీ మాస్ లుక్ లో అలరిస్తున్నాడు. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. కార్తీ, సూర్య మరియు చినబాబు చిత్ర యూనిట్ విశాఖ జిల్లాలోని సింహాచలనం దేవాలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి గంట శ్రీనివాస రావు తో కలసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

    సింహాచలంలో బ్రదర్స్

    సింహాచలంలో బ్రదర్స్

    సూర్య, కార్తీ ఇద్దరూ నేడు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. హీరోలిద్దరూ రావడంతో గుడి ప్రాంగణం కోలాహలంగా మారింది. సూర్య, కార్తీని చూసేందుకు జనాలు ఎగబడ్డారు.

     వైజాగ్ సెంటిమెంట్

    వైజాగ్ సెంటిమెంట్

    హీరో సూర్యకు వైజాగ్ పై ప్రత్యేక దృష్టి, సెంటిమెంట్ ఉన్నాయి. తన ప్రతి చిత్ర విడుదల సందర్భంగా సూర్య వైజాగ్ లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ఇప్పుడు తన సోదరుడు కార్తీ చినబాబు చిత్రం కోసం వైజాగ్ వచ్చాడు.

    మంత్రితో మీడియా సమావేశం

    మంత్రితో మీడియా సమావేశం

    సూర్య, కార్తీ తోపాటు చినబాబు చిత్ర యూనిట్ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలసి మీడియా సమేవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు గంటా శుభాకాంక్షలు తెలియజేశారు.

    వైజాగ్ గురించి ఓ రేంజ్ లో గంటా

    వైజాగ్ గురించి ఓ రేంజ్ లో గంటా

    సినిమాలకు విశాఖ నగరం ఎంత అనుకూలమో మంత్రి గంటా వివరించారు. తాన్ ప్రసంగంలో వైజగ్ గురించి ఓ రేంజ్ లో మాట్లాడారు. రాఘవేంద్ర రావు, బాలచందర్ వంటి ఎందరో సీనియర్ దర్శకులు, హీరోలకు విశాఖ నగరం సెంటిమెంట్ అని గంగా తెలిపారు. షూటింగ్స్ కు విశాఖ నగరం అనుకూలమైన ప్రాంతం అని తెలిపారు.

    సూర్య, కార్తీకి రిక్వస్ట్

    సూర్య, కార్తీకి రిక్వస్ట్

    విశాఖలో ప్రజలు కూడా షూటింగ్స్ కోసం సహకరిస్తారు అని తెలిపారు. సూర్యని ఇంతకుముందే రిక్వస్ట్ చేశాను. మల్లీ చేస్తున్నాను.. ఇకపై నటించే ప్రతి చిత్రం కొంతభాగం షూటింగ్ వైజాగ్ లో చేయాలని గంటా కోరారు. సూర్య, కార్తీ చప్పట్లు కొట్టి తమ సమ్మతిని తెలియజేసారు.

     సింగిల్ విండో పాలసీ

    సింగిల్ విండో పాలసీ

    సినిమా షూటింగ్స్ అనుమతి, చెల్లింపు ధరల విషయంలో ఇబ్బందులు ఉన్నాయని తెలిసింది. త్వరలోనే కమిటీ వేసి ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తాం అని మంత్రి గంటా హామీ ఇచ్చారు.

    చినబాబు హిట్ ఖాయం

    చినబాబు చిత్రం సూపర్ హిట్ కావడం ఖాయం అని మంత్రి అన్నారు. సక్సెస్ మీట్ కూడా విశాఖలోనే ఏర్పాటు చేయాలనీ సూర్య, కార్తీని కోరారు.

    English summary
    Ganta Srinivasa rao press meet along with Suriya and Karthi. Surya, Karthi visits Simhachalam temple
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X