»   »  ‘గరం’: రాజమౌళి గొప్పగా చెప్పారన్న ప్రభాస్ (టీజర్, ఫోటోస్)

‘గరం’: రాజమౌళి గొప్పగా చెప్పారన్న ప్రభాస్ (టీజర్, ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆది, ఆదాశర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘గరం'. మదన్ దర్శకత్వంలో శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో పి.సురేఖ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ టీజర్‌ను హీరో ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేసారు. ప్రభాస్ విడుదల చేయడంతో సినిమాకు మరింత హైప్ వచ్చినట్లయింది.

టీజర్ విడుదల అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ... టీజర్లో ఆది చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు. సాయికుమార్‌గారు తొలిసారి నిర్మిస్తున్న ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. దర్శకుడు మదన్ గురించి రాజమౌళి చాలా గొప్పగా చెప్పారు, చాలా టాలెంటెడ్ డైరెక్టర్ అని ప్రభాస్ తెలిపారు.


సాయికుమార్ మాట్లాడుతూ ప్రభాస్ మా గరం టీజర్‌ను ఆవిష్కరించినందుకు ఆనందంగా వుంది. ప్రభాస్ ఇప్పుడు మన తెలుగు వాళ్లంతా గర్వించే స్థాయికి ఎదిగాడు. దేశమంతా ఆయనను బాహుబలిగా కీర్తిస్తున్నారు. త్వరలోనే గరం ప్రేక్షకుల ముందుకొస్తుంది అన్నారు.


ప్రభాస్, ఆది

ప్రభాస్, ఆది

ఆది, అదా శర్మ నటించిన గరం ఫస్ట్ లుక్ టీజర్ ప్రభాస్ విడుదల చేసారు.


సాయి కుమార్

సాయి కుమార్

సాయికుమార్‌గారు తొలిసారి నిర్మిస్తున్న ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు ప్రభాస్.


రాజమౌళి గొప్పగా చెప్పారు

రాజమౌళి గొప్పగా చెప్పారు

దర్శకుడు మదన్ గురించి రాజమౌళి చాలా గొప్పగా చెప్పారు, చాలా టాలెంటెడ్ డైరెక్టర్ అని ప్రభాస్ తెలిపారు.


టీజర్

గరం ఫస్ట్ లుక్ టీజర్


English summary
Garam Teaser, Starring Aadi, Adah Sharma, Brahmanandam and Shakalaka Shankar. Directed by Madan. Music directed by Agasthya.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu