తమ్ముడు బాలయ్య గురించి ఎన్టీఆర్ కూతురు గారపాటి లోకేశ్వరి ఎమోషనల్ స్పీచ్
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ కనివీని ఎరుగని రీతిలో నిర్వహించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరయ్యారు.
ముందు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. నందమూరి తారక రామరావు నలుగురు కూతుళ్లు గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేయించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ కూతురు గారపాటి లోకేశ్వరి మాట్లాడుతూ... ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని విష్ చేశారు. అందరి సమిష్టి కృషి వల్లే ఈ చిత్రం వస్తుందన్నారు. నా తమ్ముడు బాలయ్య అంటే అపారమైన ప్రేమ. అందుకే నాకు మాటలు రావడం లేదు. ఈ చిత్రం బాలయ్యకు పెద్ద విజయం తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో, ట్రైలర్ లాంఛ్ వేడుకలు శుక్రవారం (డిసెంబర్ 21) గ్రాండ్‌గా ఫిల్మ్ నగర్ లోని JRC కన్వెన్షన్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఆర్ కుటుంబంతో పాటు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులందరూ హాజరయ్యారు.

నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా మాటలు అందించారు.


Click it and Unblock the Notifications











