For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవిపై నోరుపారేసుకొన్న గరికపాటి.. ‘అక్కినేని పోస్టర్‌పై పేడ’ వీడియోతో మెగా ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్

  |

  ప్రముఖ రాజకీయ వేత్త, మాజీ కేంద్ర మంత్రి, గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులతోపాటు మెగాస్టార్ చిరంజీవి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై ప్రశంసలు గుప్పించారు. ఈ వేడుకలో చిరంజీవిపై గరికపాటి నర్సింహారావు నోరుపారేసుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. గరికపాటి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

  ఒక హీరో పోస్టర్‌పై మరో హీరో ఫ్యాన్స్ అశుద్ధం

  ఒక హీరో పోస్టర్‌పై మరో హీరో ఫ్యాన్స్ అశుద్ధం

  బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ వేడుకలో చిరంజీవి తన ప్రసంగాన్ని ఎమోషనల్‌గా కొనసాగించారు. తాను చిత్రసీమలో ఎదుగుతున్న సమయంలో ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి అగ్రనటులు కలివిడిగా ఉండేవారు. కానీ వాళ్ల ఫ్యాన్స్ మాత్రం ఒక హీరో పోస్టర్‌పై మరొకరు అశుద్ధం చల్లుకునే వారు. ఆ పరిస్థితిని మార్చాలని తాను ప్రయత్నించాను అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

  గరికపాటికి శిరస్సు వచ్చి చిరు నమస్కారం

  గరికపాటికి శిరస్సు వచ్చి చిరు నమస్కారం


  చిరంజీవి తన ప్రసంగం ముగించే ముందు పద్మశ్రీ గరికపాటి నర్సింహరావు కనిపించగానే.. అయ్యా మిమ్మల్ని ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. మిమ్మల్ని, మీ ప్రవచనాలను ఎంతగా ఇష్టపడుతానో.. ఇన్సిపిరేషన్‌గా తీసుకొంటానో మీకు తెలియదు అన్నారు. గరికపాటి వద్దకు వెళ్లి శిరస్సు వచ్చి చిరంజీవి నమస్కారం చేశారు. మీకు పద్మశ్రీ వచ్చిన తర్వాత అభినందనలు, శుభాకాంక్షలు తెలిపానని ఆయనతో చిరంజీవి అన్నారు. మీ ఆలోచనలు నా ఆలోచనలకు దగ్గరగా ఉంటాయి. మూఢ భక్తులం కాదు.. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తాం. ఇంత మంది ముందు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. వీలును బట్టి మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానించుకొంటా అని చిరంజీవి అన్నారు.

  చిరంజీవి ఫోటో సెషన్ ఆపేయాలి అంటూ గరికపాటి వార్నింగ్

  అయితే చిరంజీవి తన ప్రసంగం ముగించిన తర్వాత మహిళా అభిమానులు పెద్ద ఎత్తున చిరంజీవి వద్దకు వచ్చి ఫోటోలు తీసుకొనేందుకు ప్రయత్నించారు. దాంతో వారితో కలిసి ఫోటోలు దిగుతుండగా.. గరికపాటి నర్సింహారావు తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అయితే చిరంజీవి ఫోటోలు దిగుతుండగా.. అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ అగితే నేను మాట్లాడుతాను. లేకపోతే వెళ్లిపోతాను.

  చిరంజీవి గారు దయచేసి ఫోటో సెషన్ ఆపేసి.. పక్కకు రండి.. నేను మాట్లాడుతాను. చిరంజీవికి విన్నపం.. ఫోటో సెషన్ ఆపి ఇక్కడికి రావాలి. లేకపోతే నాకు సెలవు ఇప్పించండి అంటూ ఘాటుగా గరికపాటి స్పందించాడు.

  చిరంజీవి మర్యాదను గౌరవించకుండా

  చిరంజీవి మర్యాదను గౌరవించకుండా


  చిరంజీవిపై గరికపాటి అనుచితంగా వ్యవహరించడంపై నెటిజన్లు, మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది క్షణాల ముందే గరికపాటితో చిరంజీవి వ్యవహరించిన తీరు.. ఇచ్చిన మర్యాదను పట్టించుకోకుండా ఆయన అహంభావం ప్రదర్శించడం సరికాదు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. భారీగా కామెంట్లు పెడుతూ.. గరికపాటి వ్యవహారాన్ని తప్పు పడుతున్నారు.

  ఏఎన్నాఆర్ పోస్టర్‌పై పేడ కొట్టానని గరికపాటి


  అంతేకాకుండా అధ్యాత్మిక గురువైన గరికపాటి చేసిన ఓ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసి ట్రోల్ చేస్తున్నారు. ఓ సందర్భంలో గరికపాటి మాట్లాడుతూ... నేను నందమూరి తారకరామారావు అభిమానిని. ఆయన అభిమాన సంఘానికి ఉపాధ్యక్షుడినో.. అపాధ్యక్షుడిగానో ఉన్నాను ఆ సమయంలో మాకు ప్రధాన శత్రువు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన సినిమాలపై మేము పేడ కొట్టేవాళ్లం అని గరికపాటి చెప్పిన వీడియోను పోస్ట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. అదే వీడియోలో సినీ అభిమానులు ఇతర హీరోల పోస్టర్లపై పేడ కొట్టుకోవడం తప్పని చెప్పిన చిరంజీవి వీడియోను కూడా జత చేశారు.

  English summary
  Megastar Chiranjeevi emotional speech at Bandaru Dattatreya alai balai after GodFather success. He given a call to spread love among the human beings. Apart from this.. Garikapati Narasimha Rao derogatory comments on Chiranjeevi goes contraversial.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X