సాయి పల్లవి తీసుకున్న ఆ నిర్ణయంపై గరికపాటి భావోద్వేగం.. దండం పెడుతూ, ఇంతకంటే ఏం చెప్పలేను

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అనగానే పాజిటివ్ కామెంట్స్ అనే కాకుండా చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. ఇక సాంప్రదాయాలను ఎక్కువగా గౌరవం ఇచ్చే ప్రముఖులు నిత్యం హీరోయిన్స్ పై సెటైర్స్ వేయడం కామన్. వాళ్ళు వేసే డ్రెస్ లపై ఎదో ఒక రకంగా కాంట్రవర్సీ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు. అయితే ఇటీవల ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మొదటి సారి ఒక హీరోయిన్ తీసుకున్న నిర్ణయంపై చాలా పాజిటివ్ గా స్పందించారు.

సాయి పల్లవిపై ఎమోషనల్ గా..

సాయి పల్లవిపై ఎమోషనల్ గా..

ప్రవచనకర్తగా ఎన్నో విషయాలపై అవహగన కల్పించేలా మాట్లాడే గరికపాటి నరసింహారావుకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. నేటితరానికి అర్థమయ్యేలా కూడా చాలా హాస్యాస్పదంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. టిక్ టాక్ లో మొన్నటివరకు ఆయనకు సంబంధించిన కామెంట్స్ ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇక ఇటీవల సాయి పల్లవికి సంబంధించిన ఒక విషయం గురించి మాట్లాడుతూ కొంత భావోద్వేగానికి గురయ్యారు.

చేతులెత్తి నమస్కరిస్తున్నా..

చేతులెత్తి నమస్కరిస్తున్నా..

ఈ మధ్య కాలంలో వచ్చిన హీరోయిన్స్ లలో సాయి పల్లవి అంటే తనకు చాలా గౌరవం అని ఆమె తీసుకున్న నిర్ణయం తనను ఎంతగానో ఆకర్షించింది అన్నారు. నా కంటే చిన్న అమ్మాయి అయినప్పటికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. నా కూతురిలా భావించి సమస్థ సన్మంగళని బవంతు అని అనేశానని వివరణ ఇచ్చారు.

ఆ మాటలతో గౌరవం పెరిగింది..

ఆ మాటలతో గౌరవం పెరిగింది..

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి కురచ దుస్తులు వేసుకొనని చెప్పడంతో ఆమెపై ఎంతగానో గౌరవం పెరిగేలా చేసిందని, నా సినిమాను నా తల్లిదండ్రులు చూస్తుంటే ఇబ్బంది పడకూడదు. రేపు నా పిల్లలు కూడా మంచి మనసుతో నా సినిమాలు చూసేలా ఉండాలని ఆమె చెప్పిన విధానం కూడా తనను ఎంతగానో ఆకట్టుకుందని అందుకే రెండు చేతులెత్తి నమస్కారం చేస్తున్నానని గరికపాటి మాట్లాడారు.

Recommended Video

Shakeela To Release Her Film In OTT Platform
ఇలాంటి వాళ్ళు ఉంటేనే..

ఇలాంటి వాళ్ళు ఉంటేనే..

అదే విధంగా ఇలాంటి వాళ్ళు ఉంటే సినిమా పరిశ్రమ చాలా బావుంటుందని కూడా గరికపాటి తనదైన శైలిలో సాయి పల్లవి గురించి పాజిటివ్ గా స్పందించారు. ఇక ఆ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగా సాయి పల్లవి మరో సావిత్రి లాంటి హీరోయిన్ అని ఓ వర్గం అభిమానులు స్పందిస్తున్నారు. కీర్తి సురేష్ కూడా ఈ మధ్య కాలంలో ఆ విధంగానే ఆకట్టుకుంటున్నట్లు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X