Pushpa మూవీపై గరికపాటి సంచలన వ్యాఖ్యలు: వాడు హీరోలా బిల్డప్.. బన్నీ అలా అనొచ్చా అంటూ ఘాటుగా!

బడా ప్రొడ్యూసర్ కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రెండేళ్ల క్రితం సంక్రాంతికి 'అల.. వైకుంఠపురములో' అనే మూవీతో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న ఈ స్టైలిష్ హీరో.. గత ఏడాది డిసెంబర్‌లో 'పుష్ప' అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

Recommended Video

Pushpa Movie పై Garikipati Narasimha Rao కామెంట్స్ తప్పా? తగ్గాల్సింది ఎవరు? | Filmibeat Telugu

పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ మూవీతో తెలుగులోనే కాదు.. దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమాపై, అల్లు అర్జున్‌పై పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

పుష్పగా అల్లు అర్జున్ అరాచకం

పుష్పగా అల్లు అర్జున్ అరాచకం

అల్లు అర్జున్‌ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే ‘పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. సునీల్, అనసూయ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్స్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఇది భారీ విజయాన్ని అందుకుంది.

అంతటా హిట్... అక్కడ భారీగా

అంతటా హిట్... అక్కడ భారీగా

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గంథపు చెక్కల నేపథ్యంతో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప' తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కింది. ఇలా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా భారీగా కలెక్షన్లతో సత్తా చాటేసింది.

 పుష్ప మూవీ మొత్తం వసూళ్లిలా

పుష్ప మూవీ మొత్తం వసూళ్లిలా

క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ. 175 కోట్లు పైగా వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 35 కోట్ల లాభాలు కూడా సొంతం అయ్యాయి.

పుష్పపై గరికపాటి సంచలనం

పుష్పపై గరికపాటి సంచలనం


అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీసిన ‘పుష్ప' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఇందులోని తగ్గేదేలే అనే డైలాగ్‌తో పాటు శ్రీవల్లి స్టెప్ మరింత ఫేమస్ అయ్యాయి. దీంతో చాలా మంది సెలెబ్రిటీలు సైతం వీటితో వీడియోలు చేశారు. ఇంతటి హవా చూపించిన ఈ మూవీపై ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

 వాడు హీరోలా బిల్డప్ ఇస్తాడు

వాడు హీరోలా బిల్డప్ ఇస్తాడు


తాజాగా ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావు ఓ ప్రసంగాన్ని వినిపించారు. అందులో పిల్లల పెంపకం గురించి మాట్లాడుతూ.. ‘ఇప్పుడు ఎవరైనా పిల్లవాడు ర్యాంకు సాధిస్తే వాడికి సెలెబ్రేషన్స్ చేసేస్తున్నారు. దీంతో వాడు హీరోలా బిల్డప్‌లు ఇస్తున్నాడు. నన్ను మించిన హీరో ఇంక లేడు అనుకుంటున్నాడు. దీంతో అనర్థాలు జరుగుతున్నాయి' అని చెప్పుకొచ్చారు.

స్మగ్లింగ్ అంటే మంచిదా అని

స్మగ్లింగ్ అంటే మంచిదా అని

ఇక, సినిమాల గురించి గరికపాటి మాట్లాడుతూ.. ‘ఇవాళ సినిమాలు రౌడీ, ఇడియ‌ట్ అంటూ సినిమాలు వ‌స్తున్నాయి. నిన్న కాక మొన్న బాగా విజ‌య‌వంత‌మైన ‘పుష్ప'లో హీరో స్మ‌గ్ల‌ర్‌. అలా స్మ‌గ్లింగ్ చేసే వాళ్ల‌ను మంచిగా చూపించారు. అదేంటి అని అడిగితే చివ‌ర్లో మంచిగా చూపిస్తాం లేక‌పోతే పుష్ప 2 తీస్తాం, ఇంకేదైనా పార్ట్ 3 తీస్తామంటారు. అంటే నువ్వు తీసి చూపించే వరకూ ఇక్క‌డ స‌మాజం చెడిపోవాలా? ఈ సినిమా కార‌ణంగా స్మ‌గ్లింగ్ గొప్ప అనే భావ‌న రాలేదా' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 బన్నీ అలా అనొచ్చా అంటూ

బన్నీ అలా అనొచ్చా అంటూ

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన ‘తగ్గేదేలే' అనే డైలాగ్‌ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా దీనిపై గరికపాటి నరసింహారావు సెటైర్లు వేశారు. ‘స్మ‌గ్లింగ్ చేసేవాడు త‌గ్గేదేలే అంటాడా? ఎవడైనా కుర్రాడు గూబ మీద కొట్టి త‌గ్గేదేలే అంటాడు. మ‌రి దీనికెవ‌రు కార‌ణం. ఇలాంటి విష‌యాలు మాట్లాడితే అందరికీ కోప‌మే వ‌స్తుంది' అంటూ వివరించారు.

బన్నీ, సుకుమార్ చెప్పాలని

బన్నీ, సుకుమార్ చెప్పాలని

తగ్గేదేలే వంటి డైలాగుల వల్ల సమాజం పాడైపోతుందని గరికిపాటి అన్నారు. ‘ఇలాంటి డైలాగులు వ‌ల్ల స‌మాజంలో నేరాలు పెరుగుతున్నాయి. అయినా తగ్గేదేలే అని ఎవ‌డు అనాలి? హ‌రిశ్చంద్రుడు లేదా శ్రీరామ‌చంద్రుడు వంటి వాడు అనాలి. ఒక స్మ‌గ్ల‌ర్ అలాంటి డైలాగ్ వాడటం ఏంటి. దీనికి హీరో, డైరెక్టర్ సమాధానం చెప్పాలి. వాళ్లను కడిగేస్తా' అంటూ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X