బహిరంగంగా పొగతాగుతూ పట్టుబడ్డ ప్రముఖ దర్శకుడు
ప్రముఖ దర్శకుడు గౌతమ్ ఘోష్ ని బహిరంగ ధూమపానం కేసు నమోదు చేసి జరిమానా కట్టించారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆ ఫ్ ఇండియా (ఇఫీ)లో 'మోనేర్ మనుష్' చిత్రానికి బంగారు నెమలి అందుకున్న గౌతమ్.. గోవాలో జరుగుతున్న చిత్రోత్సవాల సందర్భంగా పరిసర ప్రాంతాల్లోనే సిగరెట్ కాల్చారు. కళా అకాడమీ ఆవరణలోని నిషిద్ధ ప్రాంతంలో ఆయన ధూమపానం చేస్తుండగా స్థానిక ఇన్‌స్పెక్టర్ సందేశ్ చోడంకర్ కంటబడ్డారు. అంతే వెంటనే ఆయన, గౌతమ్‌ను పట్టుకుని కేసు నమోదు చేశారు. బెంగాలీ నటుడు అనన్య ఛటర్జీ కూడా ఇలాగే దొరికిపోయారు. అయితే, కేసులు పెడుతున్నా... ఆ ప్రాంతంలో పొగ తాగడం నిషేధం అంటూ సూచించే బోర్డులు మాత్రం సరైన రీతిలో ఏర్పాటు చేయలేదు. పది రోజులుగా కొనసాగుతున్న చిత్రోత్సవాల్లో ఇప్పటి దాకా 50 మందిపై ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఇక గౌతమ్ ఘోష్ కలేబెలా, యాత్ర, అభయ్ అరణ్యం, పార్, పతంగ్, గుడియా వంటి చిత్రాలు తీసారు.


Click it and Unblock the Notifications











