For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తనయుడికి కాస్ట్లీ కానుకిచ్చిన మహేష్..

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు తన ముద్దుల తనయుడు గౌతం కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కాస్లీ గిఫ్ట్ కొనిచ్చాడు. గౌతం నిన్న(ఆగస్టు 31) 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తనయుడికి ఖరైదీన కారు(టాయోటా ల్యాండ్ క్యూయిజర్) గిఫ్టుగా కొనిచ్చాడు.

    మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...గౌతం ఇప్పటి నుంచే కారు నడపడంలో ట్రైనింగ్ అవుతున్నాడట. తండ్రి పక్కన కూర్చుంటే స్వయంగా నడుపుతాడని, త్వరలోనే పూర్తి స్థాయిలో సొంతగా కారు నడిపే స్థాయికి వస్తాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తనయుడి కోసం ఖరీదైనకారు కొని ఇచ్చినట్లు సమాచారం.

    ప్రస్తుతం మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మల్టీ స్టారర్ చిత్రంలో వెంకటేష్ మరో హీరోగా చేస్తున్నాడు. సమంత, అంజలి హీరోయిన్లు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    English summary
    According to latest buzz Prince Mahesh Babu who tends to be a loving fathers, proved as caring father too. Jr.Prince Gautam Krishna who is celebrating his 6th birthday on August 31st got a very costly gift at his tender age from his father.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X