పవన్ కల్యాణ్ కోసం కాదు.. గోపిచంద్ కోసమే.. వివాదమొద్దు...
1902లో రమణమహర్షి రాసిన హూ యామ్ ఐ అనే రచన నుంచి స్ఫూర్తి పొంది గౌతమ్ నంద కథను సిద్ధం చేసుకున్నానని ఆయన చెప్పారు. జూన్ 20 తేదీ ఆయన జన్మదినం. ఈ సందర్భంగా సంపత్ నంది మీడియాతో ముచ్చటిస్తూ..
యువ దర్శకుల్లో సంపత్ నందిది ప్రత్యేకమైన శైలి. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా మారారు. 1902లో రమణమహర్షి రాసిన హూ యామ్ ఐ అనే రచన నుంచి స్ఫూర్తి పొంది గౌతమ్ నంద కథను సిద్ధం చేసుకున్నానని ఆయన చెప్పారు. జూన్ 20 తేదీ ఆయన జన్మదినం. ఈ సందర్భంగా సంపత్ నంది మీడియాతో ముచ్చటిస్తూ.. పూర్తిగా తాత్విక ధోరణిలో సినిమా ఉండదు. ఇంతకు ముందు నేను చేసిన సినిమాల్లో ప్రజలకు, ఊరికి కష్టం వస్తే హీరో అండగా నిలుస్తాడనే పాయింట్‌తో చేశాననని ఆయన చెప్పారు.

ఆ గ్యాప్ కారణం అది కాదు..
నా సినిమాలకు కథ, మాటలు నేనే రాసుకుంటాను. అందుకే ఎక్కువ గ్యాప్ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. బెంగాల్ టైగర్ తర్వాత కేవలం ఆరు నెలల్లోనే సినిమాను ప్రారంభించాం. ఆ సినిమాకు ముందు పరిస్థితులు ప్రభావం వల్ల రెండేళ్ల గ్యాప్ వచ్చింది.

ఆ కథ వేరే ఉంది..
ఈ చిత్రం పవన్ కల్యాణ్ కోసం రాసిన కథ కాదు. చాలా కాలంగా ఈ కథ నా మనస్సులో ఉంది. బెంగాల్ టైగర్ తర్వాత చాలా నెలలు దీనిపై దృష్టిపెట్టి కథగా మలిచాను. పవన్ కల్యాణ్ కోసం అనుకొన్న కథ వేరే ఉంది. ఆ కథకు, ఈ కథకు ఎలాంటి సంబంధం లేదు అని సంపత్ నంది చెప్పారు.

అందులో వాస్తవం లేదు..
పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకొని రాసినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ కథను తయారు చేయలేదు. గోపీచంద్‌ను కలిసి రెండున్నర గంటల పాటు కథ చెప్పగా ఓకే చేశారు. ఆ తర్వాత డేట్స్ కుదరడంతో సినిమా షూటింగ్ ప్రారంభించాం అని ఆయన వివరించారు.

టీజర్‌కు మంచి రెస్సాన్స్
ఇటీవల విడుదలైన గౌతమ్‌నంద టీజర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. సోషల్ మీడియాలో 25 లక్షల మందికి పైగా చూశారు. ఈ పుట్టిన రోజుకు అదే బహుమతి అని అనుకొనంటున్నాను. ఓ పాట మినహా సినిమా చిత్రీకరణ పూర్తయింది. మహాబలిపురంలో రెండురోజుల షూటింగ్‌తో పాటు హైదరాబాద్‌లో ఓ వానపాటను చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తి అవుతుంది. జూలైలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం.

అందుకే నిర్మాతగా మారాను.
నా మనసులో పుట్టిన ప్రేమకథలను సినిమాగా తీసుకువస్తే బాగుంటుందనే ఆలోచనతోనే నిర్మాతగా మారాను. నిర్మాతగా నేను మొదలుపెట్టిన పేపర్‌బోయ్ ఓ అందమైన ప్రేమకథ. ఓ ప్రొఫెసర్ కూతురికి, పేపర్‌బోయ్ మధ్య మొదలైన ప్రేమ నేపథ్యంలో నిజాయితీతో కూడి ఉంటుంది అని సంపత్ నంది చెప్పారు.


Click it and Unblock the Notifications











