twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్ కోసం కాదు.. గోపిచంద్ కోసమే.. వివాదమొద్దు...

    1902లో రమణమహర్షి రాసిన హూ యామ్ ఐ అనే రచన నుంచి స్ఫూర్తి పొంది గౌతమ్ నంద కథను సిద్ధం చేసుకున్నానని ఆయన చెప్పారు. జూన్ 20 తేదీ ఆయన జన్మదినం. ఈ సందర్భంగా సంపత్ నంది మీడియాతో ముచ్చటిస్తూ..

    By Rajababu
    |

    యువ దర్శకుల్లో సంపత్ నందిది ప్రత్యేకమైన శైలి. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా మారారు. 1902లో రమణమహర్షి రాసిన హూ యామ్ ఐ అనే రచన నుంచి స్ఫూర్తి పొంది గౌతమ్ నంద కథను సిద్ధం చేసుకున్నానని ఆయన చెప్పారు. జూన్ 20 తేదీ ఆయన జన్మదినం. ఈ సందర్భంగా సంపత్ నంది మీడియాతో ముచ్చటిస్తూ.. పూర్తిగా తాత్విక ధోరణిలో సినిమా ఉండదు. ఇంతకు ముందు నేను చేసిన సినిమాల్లో ప్రజలకు, ఊరికి కష్టం వస్తే హీరో అండగా నిలుస్తాడనే పాయింట్‌తో చేశాననని ఆయన చెప్పారు.

    ఆ గ్యాప్ కారణం అది కాదు..

    ఆ గ్యాప్ కారణం అది కాదు..

    నా సినిమాలకు కథ, మాటలు నేనే రాసుకుంటాను. అందుకే ఎక్కువ గ్యాప్ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. బెంగాల్ టైగర్ తర్వాత కేవలం ఆరు నెలల్లోనే సినిమాను ప్రారంభించాం. ఆ సినిమాకు ముందు పరిస్థితులు ప్రభావం వల్ల రెండేళ్ల గ్యాప్ వచ్చింది.

    ఆ కథ వేరే ఉంది..

    ఆ కథ వేరే ఉంది..

    ఈ చిత్రం పవన్ కల్యాణ్‌ కోసం రాసిన కథ కాదు. చాలా కాలంగా ఈ కథ నా మనస్సులో ఉంది. బెంగాల్ టైగర్ తర్వాత చాలా నెలలు దీనిపై దృష్టిపెట్టి కథగా మలిచాను. పవన్ కల్యాణ్ కోసం అనుకొన్న కథ వేరే ఉంది. ఆ కథకు, ఈ కథకు ఎలాంటి సంబంధం లేదు అని సంపత్ నంది చెప్పారు.

    అందులో వాస్తవం లేదు..

    అందులో వాస్తవం లేదు..

    పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకొని రాసినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ కథను తయారు చేయలేదు. గోపీచంద్‌ను కలిసి రెండున్నర గంటల పాటు కథ చెప్పగా ఓకే చేశారు. ఆ తర్వాత డేట్స్ కుదరడంతో సినిమా షూటింగ్ ప్రారంభించాం అని ఆయన వివరించారు.

    టీజర్‌కు మంచి రెస్సాన్స్

    టీజర్‌కు మంచి రెస్సాన్స్

    ఇటీవల విడుదలైన గౌతమ్‌నంద టీజర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. సోషల్ మీడియాలో 25 లక్షల మందికి పైగా చూశారు. ఈ పుట్టిన రోజుకు అదే బహుమతి అని అనుకొనంటున్నాను. ఓ పాట మినహా సినిమా చిత్రీకరణ పూర్తయింది. మహాబలిపురంలో రెండురోజుల షూటింగ్‌తో పాటు హైదరాబాద్‌లో ఓ వానపాటను చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తి అవుతుంది. జూలైలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం.

    అందుకే నిర్మాతగా మారాను.

    అందుకే నిర్మాతగా మారాను.

    నా మనసులో పుట్టిన ప్రేమకథలను సినిమాగా తీసుకువస్తే బాగుంటుందనే ఆలోచనతోనే నిర్మాతగా మారాను. నిర్మాతగా నేను మొదలుపెట్టిన పేపర్‌బోయ్ ఓ అందమైన ప్రేమకథ. ఓ ప్రొఫెసర్ కూతురికి, పేపర్‌బోయ్ మధ్య మొదలైన ప్రేమ నేపథ్యంలో నిజాయితీతో కూడి ఉంటుంది అని సంపత్ నంది చెప్పారు.

    English summary
    Tollywood director Sampath Nandi's Birthday today. He revealed about Gautam Nanda movie story. He cleard that this story not made for Pawan Kalyan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X