యుద్దం రంగంలోకి దూకుతున్న బాలయ్య (వీడియో)
నందమూరి నటసింహం బాలయ్య హీరోగా నటిస్తోన్న వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళకముందు నుంచే బిజినెస్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చింది.
'సమయము లేదు మిత్రమా..' అంటూ ఈ దసరాకి టీజర్‌తో ఫుల్ హల్ చల్ చేసారు నందమూరి బాలకృష్ణ. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' నటుడిగా బాలయ్యకు వందో చిత్రం. పైగా ఈ సంక్రాంతి బరిలో నిలవబోతోంది. అందుకే ఈ సినిమాపై ఇటు అభిమానులు, అటు సినీ పరిశ్రమ దృష్టి నిలిపింది, 'గౌతమి...'కి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా విశేషంగా చర్చచు నోచుకుంటోంది.
దీపావళి సందర్భంగా యుద్ధ రంగంలో కదం తొక్కుతున్న గౌతమిపుత్రుడి లుక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్టే. డిసెంబరులో పాటల్ని విడుదల చేస్తున్నారు. శ్రియ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో హేమమాలిని కీలక పాత్ర పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications