»   » గౌతమీపుత్ర శాతకర్ణి: షూటింగులో బాలయ్యకు గాయాలు!

గౌతమీపుత్ర శాతకర్ణి: షూటింగులో బాలయ్యకు గాయాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాక్షన్ ప్రధానమైన చిత్రాల్లో, యుద్ధ సన్నివేశాలుండే పీరియడ్ డ్రామా సినిమాలు షూటింగ్ జరిగేప్పుడు అందులో నటించే వారికి చిన్న చిన్న గాయాలు కావడం సహజమే. ప్రమాదకరమైన ఫీట్స్ చేస్తున్న సమయంలో కొన్ని సార్లు సీరియస్ గాయాల పాలైన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు లేకుండా షూటింగ్ ముగింపు దాదాపుగా ఉండదు అంటుంటారు.

Also Read: 'గౌతమిపుత్ర శాతకర్ణి'‌: ప్చ్...బాలయ్యకు ఈ సమస్య ఇంకా తెగలేదా?


తాజాగా బాలయ్య నటిస్తున్న 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా షూటింగులోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవలే ఈచిత్రం మోరాకోలో భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. దాదాపు 8 కోట్ల ఖర్చుతో 200 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఇక్కడ భారీ యుద్ద సన్నివేశమే చిత్రీకరించారు.


 Gautamiputra Satakarni : Balakrishna got injured!

అయితే షూటింగ్ సమయంలో బాలయ్య చిన్నగా గాయపడ్డట్లు సమాచారం. చిత్రీకరణ సందర్భంగా బాలయ్య గుర్రం మీద నుండి కింద పడిపోయారని, పెద్దగా గాయాలేమీ కాక పోయినా చిన్నగా గీసుకుపోయిన గాయాలైనట్లు తెలుస్తోంది.


యుద్ద సన్నివేశం చిత్రీకరణ జరుపుతుండగా కొందరు సైనికలు, ఒంటెలు...గుర్రం మీద ఉన్న బాలయ్యను చుట్టుముడతాయి. అయితే దీంతో బెదిరిపోయి బాలయ్య గుర్రం కంట్రోల్ తప్పిందని, ఈ క్రమంలో బాలయ్య పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే వెంటనే యూనిట్ సభ్యులు స్పందించి ఆయన్ను పైకి లేపారు. కొంత బ్రేక్ తీసుకోవాలని యూనిట్ సభ్యులు కోరినా....బాలయ్య అలాంటిదేమీ వద్దంటూ నెక్ట్స్ సీన్ కు రెడీ అయ్యారట.

English summary
Gautamiputra Satakarni film is directed by unique director Radha Krishna Jagarlamudi (Krish), This is the prestigious 100th film of Balakrishna. We all know that the team went to Morocco to shoot some crucial war sequences and makers approximately spent 8 crores money for the shooting sequences. However, while shooting for the epic action scene, Balayya injured himself. The Nandamuri scion fell from a horse and sustained a few scratches and bruises.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu