twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ పోటీ ఎప్ప‌టి నుండో ఉంటున్న‌దే: బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఇంటర్వ్యూ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కాబోతోంది.

    సినిమా ప్రమోషన్లో మంగళవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. హీరో బాలయ్య, దర్శకుడు క్రిష్, హీరోయిన్ శ్రీయ ఈ ప్రెస్ మీట్లో పాల్టొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

    పోటీ ఎప్పటి నుండో ఉంది

    పోటీ ఎప్పటి నుండో ఉంది

    సంక్రాంతి పండుగ‌కు సినిమాల మధ్య పోటీ అనేది కొత్త విషయం ఏమీ కాదు. సంక్రాంతికి రెండు మూడు పెద్ద సినిమాలు పోటీ పడటం ఎప్ప‌టి నుండో ఉంటున్న‌ది. చిరంజీవి గారికి, నాకూ ఇప్పుడొస్తున్న సినిమాలు ప్రతిష్టాత్మకమైనవి. రెండు సినిమాలూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని బాలయ్య తెలిపారు.

    కావాలని చేసింది కాదు

    కావాలని చేసింది కాదు

    ఓ వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా ఎర్ప‌డిన త‌ర్వాత అమ‌రావ‌తిని రాజ‌ధాని చేయడం, ఇదే సమయంలో నేను అమరావతిని కేంద్రంగా చేసుకుని పాలించిన గౌతమిపుత్ర శాతకర్ణి గురించి సినిమా చేయడం యాదృశ్చికమే. క‌థ న‌చ్చి చేయ‌డానికి రెడీ అయ్యానే త‌ప్ప‌ నేను కావాలని వందో సినిమాగా ప్లాన్ చేసింది కాదు అని బాలయ్య తెలిపారు.

    స్థాయికి తగిన సినిమానే

    స్థాయికి తగిన సినిమానే

    కచ్చితంగా నా వందో సినిమా స్థాయికి తగ్గ సినిమాగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి'ని చెప్పుకోవచ్చు. సినిమా చూసిన మేమంతా ఒక మంచి సినిమా తీశామన్న నమ్మకంతో, విజయంపై ధీమాగా ఉన్నాం. 2 గంటల 15 నిమిషాల్లో కథకు అవసరమయ్యే అన్ని అంశాలతో క్రిష్ ఒక గొప్ప సినిమా తీశాడు అని బాలయ్య తెలిపారు.

    ధైర్యంగా ముందడుగు వేస్తేనే సాధ్యం

    ధైర్యంగా ముందడుగు వేస్తేనే సాధ్యం

    కొత్తగా ఏదైనా చేయాల‌నుకున్న‌ప్పుడు రిస్క్ గా భావించొద్దు, ధైర్యంగా ముందడుగు వేస్తేనా ఏదైనా సాధించగలం. మేమందరం ఈ సినిమాను మొదట్నుంచీ బలంగా నమ్మాం. ఇప్పుడు ఫైనల్ ఔట్‌పుట్ చూశాక విజయంపై అంతే కాన్ఫిడెంట్‌గా ఉన్నామని బాలయ్య తెలిపారు.

    సమిష్టి కృషి

    సమిష్టి కృషి

    ఈ సినిమా ఇంత బాగా రావడానికి టీం మొత్తం కృషి చేసింది. ఒక మంచి పనిచేస్తున్నపుడు పంచ భూతాలన్నీ మనకు సహకరిస్తాయంటారు. అలా ఈ సినిమా షూటింగ్ జార్జియా, మొరాకో లాంటి ప్రాంతాల్లో చేసినప్పుడు కూడా మాకు ఏ ఇబ్బంది కలగలేదు. జార్జియాలో అయితే అంతటా వర్షం పడేది కానీ, మా షూటింగ్ ప్రాంతం మాత్రం మామూలుగా ఉండేది.

    నాన్న‌గారు చేయాల్సిన క‌థ..

    నాన్న‌గారు చేయాల్సిన క‌థ..

    నిజానికి క‌థ‌తో నాన్న‌గారు సినిమా చేద్దామ‌నుకున్నారు. కానీ ఆయ‌న బిజీ అయిపోవ‌డంతో ఆయ‌న ఈ క‌థ‌తో సినిమా చేయ‌లేక‌పోయారు... ఇపుడు నాకు ఈ అవకాశం దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అని బాలయ్య తెలిపారు.

    తెలుగు జాతి గర్వించే

    తెలుగు జాతి గర్వించే

    తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తుల్లో ఒకరు శాతకర్ణి. అలాంటి వ్యక్తి కథ ఎంతమందికి తెలుసు? అలాంటి వ్యక్తి జీవితంలోని రకరకాల భావోద్వేగాలు ఎంతమందికి తెలుసు... ఇవన్నీ ఆలోచించడంతోనే నాకు సినిమా చేయాలని ఉత్సాహం వచ్చేసింది అని బాలయ్య అన్నారు.

    ఈ సినిమాకు ఎలాంటి రెఫరెన్సులు లేవు

    ఈ సినిమాకు ఎలాంటి రెఫరెన్సులు లేవు

    గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి పాత్ర‌ను చేయ‌డానికి ఎలాంటి రెఫ‌రెన్స్‌లు లేవు. అప్ప‌టి కొన్ని శాస‌నాలు, చిత్రాల‌ను ఆధారంగా చేసుకున్నాం. అలాగే గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి పాత్ర కోసం కసరత్తులు ఏమీ చేయ‌లేదు. చేయడం అంటూ ఏమీ లేదు. దర్శకుడు క్రిష్ గారి విజన్, నాన్నగారు కూడా ఈ సినిమా చేయాలనుకొని ఉండడం లాంటివన్నీ నన్ను ముందుకు నడిపించాయి. సినిమా చేస్తున్నంత కాలం నాన్నగారు ఎక్కడో ఓ అదృశ్య శక్తిలా నన్ను నడిపించారని అనిపిస్తూంటుంది. బహుశా ఆయన ప్రేరణ లేకపోతే ఈ సినిమా ఇంత సులువుగా చేయగలిగేవాడిని కాదేమో అని బాలయ్య అన్నారు.

    ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు

    ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు

    గుర్రపు స్వారీ, కత్తి తిప్పడం లాంటివి నేనెప్పుడూ నేర్చుకోలేదు. ఆదిత్య 369, భైరవద్వీపం ఆ సమయంలో సినిమాకు అవసరం అంటే చేసేశా. అదే ఉత్సాహంతో ఇప్పుడూ ఈ సినిమాలో యుద్ సన్నివేశాల కోసం ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు అని బాలయ్య తెలిపారు.

    స్టీవెన్ స్పీల్ బర్గ్ తో క్రిష్ ను పోల్చొచ్చు

    స్టీవెన్ స్పీల్ బర్గ్ తో క్రిష్ ను పోల్చొచ్చు

    క్రిష్ ఒక అద్భుతమైన దర్శకుడు. ఆయన గతంలో చేసిన ఐదు సినిమాలూ వేటికవే ప్రత్యేకమైనవి. హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో క్రిష్‌ను పోల్చవచ్చు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఉండే స్పీల్‌బర్గ్‌తో క్రిష్‌ను పోల్చానంటే ఆలోచించండి ఆయన టాలెంట్ ఏమిటో... అంటూ బాలయ్య కామెంట్ చేసారు.

    హేమా మాలిని, శ్రీయ గురించి

    హేమా మాలిని, శ్రీయ గురించి

    హేమా మాలిని లాంటి గొప్ప నటి మా సినిమాలో నటించారు. నాన్నగారి సినిమాలో ఒకసారి నటించారామె. మళ్ళీ ఇన్నేళ్ళకు తెలుగులో ఒక బలమైన పాత్రతో మెప్పించనున్నారు. ఇక శ్రియ చాలా తెలివైన నటి. ఆమె ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. కబీర్ బేడి కూడా విలన్‌గా చాలా బాగా చేశారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం, నేప‌థ్య సంగీతం, జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు ప్ల‌స్ అయ్యాయి అని బాలయ్య తెలిపారు.

    English summary
    Check out Balakrishna interview about Gautamiputra Satakarni. Gautamiputra Satakarni is a 2017 Telugu epic historical action film produced by Saibabu Jagarlamudi, Y. Rajeev Reddy on First Frame Entertainment banner and directed by Krish.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X