»   » ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుండి ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

శాతవాహన మహారాజు "శాతకర్ణి" జీవితం ఆధారంగా క్రిష్ తెరకెక్కించిన హిస్టారికల్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై బిబో శ్రీనివాస్ సమర్పణలో వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు నిర్మించారు.

సెన్సార్

సెన్సార్

బాలకృష్ణ సరసన శ్రేయ "వశిష్ట మహాదేవి"గా ముఖ్యభూమిక పోషించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటీమణి హేమమాలిని శాతకర్ణుడి వీరమాత "గౌతమి"గా ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. జనవరి 5న "గౌతమీపుత్ర శాతకర్ణి" చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు సింగిల్ కట్ కూడా లేకుండా "యు/ఎ" సెర్టిఫికేట్ ఇచ్చారు.

దృశ్య కావ్యం

దృశ్య కావ్యం

శాలివాహన శకం నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్రిష్ ఓ దృశ్యకావ్యంలా తెరకెక్కించారని, సినిమా చూస్తున్నంతసేపు గౌతమిపుత్ర శాతకర్ణుడిగా నందమూరి నటసింహం బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందని సెన్సార్ సభ్యులు క్రిష్ అండ్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ

నిర్మాత మాట్లాడుతూ

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ.. "మా శాతకర్ణి సెన్సార్ పూర్తయ్యింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు "సినిమా అద్భుతంగా ఉంది" అంటూ అభినందనలు తెలపడంతోపాటు.. బాలకృష్ణ నటవిశ్వరూపం, భారీ వ్యయంతో తెరకెక్కించిన యుద్ధ సన్నివేశాలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.

పండగ రిలీజ్

పండగ రిలీజ్

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న "గౌతమిపుత్ర శాతకర్ణి" ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నందమూరి అభిమానులనే కాక యావత్ తెలుగు సినిమా అభిమానులను విశేషంగా అలరించడం ఖాయం" అన్నారు.

తెరవెనక

తెరవెనక

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ణానశేఖర్, సంగీతం: చిరంతన్ భట్, కళ: భూపేష్ భూపతి, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంభాషణలు: సాయిమాధవ్ బుర్ర, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వర్రావు, సమర్పణ: బిబో శ్రీనివాస్, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్!

English summary
Nandamuri Balakrishna and Krish teamed up for most powerful and historical entertainer Gautamiputra Satakarni. The prestigious film made as Balakrishna’s 100th is slated for Sankranti release. Gautamiputra Satakarni completed censor formalities today and received U/A rating from the censor board, gearing for grand worldwide release on January 12th. The movie is going to explore the untouched era of greatest and first Telugu emperor who ruled entire India. This point has never been dealt before in Telugu cinema and is a matter of pride for Telugu audience.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu