»   » ఇదొక బృహత్ కార్యం, బాలయ్య ఫ్యాన్స్ సపోర్టుతో... (ఫోటోస్)

ఇదొక బృహత్ కార్యం, బాలయ్య ఫ్యాన్స్ సపోర్టుతో... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న ఈ సినిమా భారీ విజయం సాదించాలని కోరుకుంటూ బాలయ్య అభిమానులు ఓ భారీ కార్యక్రమాన్ని చేపట్టారు. భార‌త‌దేశంలో 1116 శివాల‌యాల్లో మ‌హారుద్రాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ మ‌హారుద్రాభిషేక కార్య‌క్ర‌మం సోమ‌వారం ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధాన‌మ్‌లో బాలయ్య చేతుల మీదుగా ప్రారంభమైంది. నంద‌మూరి బాల‌కృష్ణ‌తో పాటు ద‌ర్శ‌కుడు క్రిష్‌. చిత్ర స‌మ‌ర్ప‌కుడు బిబో శ్రీనివాస్‌, నిర్మాత‌లు వై.రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్ల‌మూడి క్రిష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


దైవ సంకల్పమే

దైవ సంకల్పమే

నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడ‌తూ - ``గౌత‌మిపుత్ర శాత‌కర్ణి విజ‌య‌ం కోసం అభిమానులు మ‌హారుద్రాభిషేకం చేయ‌డం ఆనందంగా ఉంది. ఈ బృహ‌త్ కార్య‌క్ర‌మం ఇలా చేయ‌డం దైవ సంక‌ల్పంగా భావిస్తున్నామని బాలయ్య అన్నారు.


తెలుగు జాతి గొప్పదం

తెలుగు జాతి గొప్పదం

తెలుగు జాతి గొప్ప‌త‌నాన్ని ప్రపంచానికి తెలియ‌జేసిన చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మిపుత్రుని గురించిన చ‌రిత్ర చాలా త‌క్కువ‌గా ఉంది. అటువంటి చరిత్ర‌ను సినిమా తెర‌కెక్కించడానికి ముందుకు వ‌చ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను అభినందిస్తున్నాను. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి త‌ల్లిగారు కరీంన‌గ‌ర్ జిల్లాలో కోటిలింగాల‌ప్రాంతంలో జ‌న్మించారు. ఆమె త‌న‌యుడైన శాత‌కర్ణి భారత‌దేశాన్ని ఏక‌చ‌త్రాధిప‌త్యంగా పాలించారు. నంద‌మూరి వారసుడిగా ఇంత గొప్ప సినిమాను చేయ‌డం నా అదృష్టంగా, దైవేచ్చ‌గా భావిస్తున్నాను అని బాలయ్య అన్నారు.


ఆడియో

ఆడియో

గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో డిసెంబ‌ర్ 16న ఆడియో విడుద‌ల చేస్తేందుకు ప్లాన్ చేస్తున్నట్లు బాలయ్య తెలిపారు.


దర్శకుడు మాట్లాడుతూ

దర్శకుడు మాట్లాడుతూ

దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ...సినిమా ఆడియో విడుద‌ల‌ను డిసెంబ‌ర్ 16న తిరుప‌తిలో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. అలాగే సినిమాను జ‌న‌వ‌రిలో సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. సినిమా వ్య‌వ‌థి రెండు గంట‌ల ప‌న్నెండు నిమిషాలుంటుంది. బాల‌య్య అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కులు ఎంతో ఎగ్జ‌యిటింగ్‌గా సినిమా విడుద‌ల కోసం వెయిట్ చేస్తున్నారు అని అన్నారు.


బాలయ్య తప్ప ఎవరూ చేయలేరు

బాలయ్య తప్ప ఎవరూ చేయలేరు

ఎన్.టి.ఆర్‌గారు ఎన్నో గొప్ప పాత్ర‌లు వేసినా గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి పాత్ర‌ను బాల‌కృష్ణ‌గారి కోసం చేయ‌న‌ట్టున్నారు. బాల‌కృష్ణ‌గారు త‌ప్ప మరెవ‌రూ ఈ పాత్ర‌ను చేయ‌లేరు. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. చాలా ఆశ‌లు, ఆశ‌యాల‌తో చేసిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని నమ్మ‌కంగా ఉన్నామని దర్శకుడు అన్నారు.


English summary
Gautamiputra Satakarni Movie Team Maha Rudrabhishekam Event at Filmnagar Daivasannidanam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu