twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్తగా ఉంది: జనవరి 8న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పతాకోత్సవం!

    జనవరి 8న 'పతాకోత్సవం' నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని 100 థియేటర్ల వద్ద ప్రత్యేకంగా డిజైన్ చేయించిన గౌతమీపుత్ర శాతకర్ణి జెండాను ఆవిష్కరించబోతున్నారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినిమా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా బాలకృష్ణ నటిస్తున్న 100వ మూవీ 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. సనిమా ప్రమోషన్లో భాగంగా త్వరలో సరికొత్త ఈవెంట్ నిర్వహించబోతున్నారు.

    ఇతర వార్తలు
    ఖైదీ, శాతకర్ణి.... వార్ వన్ సైడ్ లాంటివి నమ్మను!
    13 ఏళ్ల తర్వాత మళ్లీ చిరు-బాలయ్య క్లాష్, గతంలో ఏం జరిగిందంటే?
    శని నడిచింది, ఎన్టీఆర్ తో సినిమా తీసి 25 కోట్లు నష్టం, సావిత్రిగా ఆమెనే ఫైనల్

    జనవరి 8న 'పతాకోత్సవం' నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని 100 థియేటర్ల వద్ద ప్రత్యేకంగా డిజైన్ చేయించిన గౌతమీపుత్ర శాతకర్ణి జెండాను ఆవిష్కరించబోతున్నారు. ఇందుగాను జనవరి 8న సాయంత్రం 5.40 గంటలకు ముహూర్తం నిర్ణయించారు.

    Gautamiputra Satakarni

    'గౌతమీపుత్ర శాతకర్ణి' తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పే సినిమా అని, ఈ పతాకోత్సవంలో తెలుగురాష్ట్రాలకు చెందిన ప్రజలంతా భాగస్వామ్యం కావాలని చిత్ర దర్శకుడు క్రిష్, నిర్మాతలు వై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు పిలుపునిచ్చారు.

    విశాఖలోని జ్యోతి థియేటర్లో జరిగే పతాకోత్సవంలో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ సాయి కొర్రపాటి హాజరు కానున్నారు. మిగిలిన 99 థియేటర్ల వద్ద బాలయ్య అభిమానుల సమక్షంలో పతాకోత్సవం జరుగనుంది.

    English summary
    One more big celebration is on cards for Nandamuri Balakrishna’s historical 100th film Gautamiputra Satakarni. Director Krish and producers Y Rajeev Reddy, Jagarlamudi Saibabu is here by giving a call for entire Telugu community in two Telugu states to participate in Satavahana Pathakotsavam to be performed on January 8th at 5:40 pm.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X