వందో సినిమాకి అరుదైన రికార్డ్ సాధిస్తున్న బాలయ్యబాబు..!!
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. బాలయ్య 100వ చిత్రంగా చారిత్రాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా క్రిష్, రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలయ్యకు జోడిగా శ్రియ నటిస్తుంది. హేమమాలిని ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ చిత్ర ట్రైలర్ ను భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ట్రైలర్ ను డిసెంబర్ మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100కి పైగా థియేటర్లలో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











