»   » బాహుబలిని మించిపోయేలా ఉంది: ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ థియేట్రికల్ ట్రైలర్

బాహుబలిని మించిపోయేలా ఉంది: ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ థియేట్రికల్ ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా ట్రైల‌ర్‌ శుక్రవారం గ్రాండ్ గా విడుదలైంది. కరీంనగర్ జిల్లా కోటిలింగాల ప్రాంతంలోని కోటేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక‌పూజ‌లు నిర్వ‌హించిన తర్వాత క‌రీంన‌గ‌ర్‌లోని తిరుమ‌ల థియేట‌ర్లో ట్రైలర్ రిలీజ్ చేసారు.

ఈ సందర్భంగా బాల‌కృష్ణ మాట్లాడుతూ... 'నా ప్రేక్ష‌క దేవుళ్ల మ‌ధ్య‌లో కూర్చొని ఈ సినిమా ట్రైల‌ర్‌ను చూడటం ఆనందంగా ఉందని, ఇప్పటి వరకు పౌరాణిక‌, జాన‌ప‌ద‌, సాంఘిక, సందేశాత్మ‌క సినిమాలు ఎన్నో చేశాను. వందో చిత్రంగా గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా ల‌భించ‌డం ఆనందంగా ఉందన్నారు.

శాతకర్ణి తల్లి ఇక్కడే పుట్టారు

శాతకర్ణి తల్లి ఇక్కడే పుట్టారు

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి త‌ల్లి గౌత‌మి కరీంనగర్ జిల్లాలో జన్మించారు. ఆమెకు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి లాంటి గొప్ప రాజును మనకు అందించారు. అటువంటి గొప్ప చక్రవర్తి పాత్ర‌లో న‌టిస్తున్నందకు ఎంతో ఆనందంగా ఉందని బాలయ్య తెలిపారు.

ప్రకృతి సైతం

ప్రకృతి సైతం

సినిమా షూటింగ్‌కి ప్ర‌కృతి సైతం స‌హ‌క‌రించింద‌ని, దేశంలో ఎన్నో చోట్ల వ‌ర్షాలు ప‌డుతున్న‌ప్ప‌టికీ తాము షూటింగ్ జ‌రుపుతున్న ప్రాంతంలో వ‌ర్షాలు ప‌డ‌లేద‌ని, ఆ విధంగా ప్ర‌కృతి త‌మ‌కు స‌హ‌కారం అందించింద‌ని బాలయ్య చెప్పుకొచ్చారు.

అది నా ధర్మంగా భావించాను

అది నా ధర్మంగా భావించాను

తెలుగు వారిది ఓ బ్ర‌హ్మాండ్‌మైన‌ చ‌రిత్ర, తెలుగువాడి పౌరుషాన్ని గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ప్రపంచానికి చాటిచెప్పార‌ని ఈ సందర్భంగా బాలయ్య తెలిపారు. నంద‌మూరి వార‌సుడిగా ఈ క‌థ‌ను ప్రపంచానికి చాటి చెప్ప‌డం తన ధ‌ర్మంగా భావించానని, అందుకే ఈ సినిమా చేసానని బాల‌య్య తెలిపారు.

క్రిష్ గురించి బాలయ్య

క్రిష్ గురించి బాలయ్య

తన‌ వందో సినిమాను దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించారని బాలకృష్ణ అన్నారు. మాట‌ల ర‌చ‌యిత సాయిమాధ‌వ్‌ ఈ సినిమాకు అద్భుతంగా డైలాగులు రాశారు. ఈ రోజు పుట్టిన జ‌రుపుకుంటున్న సాయి మాధవ్‌కి ఈ సందర్బంగా బాలకృష్ణ శుభాకాంక్ష‌లు తెలుపారు.

సింహం మీ మధ్యలో కూర్చుంది అంటూ మొదలు పెట్టిన క్రిష్

సింహం మీ మధ్యలో కూర్చుంది అంటూ మొదలు పెట్టిన క్రిష్

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు క్రిష్ మాట్లాడుతూ... కోటిర‌త‌నాల వీణ తెలంగాణ‌లో కోటిలింగాల సాక్షిగా నూరోచిత్రం ట్రైల‌ర్‌ రిలీజ్ చేస్తున్నాం. బాల‌య్య ఈ సినిమాను ఎందుకు త‌మ‌ చేతిలో పెట్టారో ప్రేక్ష‌కుల‌కి ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని అన్నారు.

English summary
Much awaited Trailer of Nandamuri Balakrishna's Epic Movie Gautamiputra Satakarni directed by Anjanaputra Krish. The Trailer shows shows the glimpse of the story of the unsung hero Gautamiputra Satakarni. This is a prestigious product from First Frame Entertainments.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu