»   » బాహుబలిని మించిపోయింది: బాలయ్య 100వ సినిమా!

బాహుబలిని మించిపోయింది: బాలయ్య 100వ సినిమా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి.

నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం కావ‌డం, తెలుగు జాతి ఔన‌త్యాన్ని ప్ర‌పంచానికి చాటిన తెలుగు చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఆధారంగా రూపొందుతోన్న చిత్రం కూడా కావ‌డంతో సినిమా ప్రారంభం నుండే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు ద‌ర్శ‌కుడు క్రిష్‌, నిర్మాత‌లు వై.రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబులు సినిమా గ్రాండ్‌గా తెర‌కెక్కిస్తున్నారు.

సినిమా ఫ‌స్ట్‌లుక్‌కి ఆడియెన్స్ నుండి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇటీవ‌ల‌విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ టీజ‌ర్‌ను 2.6 మిలియ‌న్స్ ఆడియెన్స్ వీక్షించారు. ఇప్పుడు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి భారీ ఎత్తున్న స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

 బాహుబలిని మించిపోయే రికార్డ్

బాహుబలిని మించిపోయే రికార్డ్

ట్రైలర్ ప్రత్యేకంగా థియేటర్లలో ప్రదర్శించడం ‘బాహుబలి' విషయంలోనే జరిగింది. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ప్రదర్శించారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి' ట్రైలర్ యూఎస్, యూకె తో వరల్డ్ వైడ్ తెలుగు వారు ఉండే ప్రాంతాలన్నింటితో కలిసి 100 థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు.

 చిత్ర నిర్మాత‌లు వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ

చిత్ర నిర్మాత‌లు వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ

నంద‌మూరి బాల‌కృష్ణ‌గారు న‌టించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. ఈ రెస్పాన్స్ చూస్తుంటే సినిమా విడుద‌ల కోసం తెలుగు ప్రేక్ష‌కులు, నంద‌మూరి అభిమానులు జ‌న‌వ‌రి 12, సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి కోసం ఎంత ఆస‌క్తిగా ఉన్నారో అర్థం అవుతుంది. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి బాల‌కృష్ణ‌గారు న‌టించిన 100వ చిత్రం కావ‌డంతో సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను యు.ఎస్‌., యు.కె. స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా వంద లోకేష‌న్స్‌లో ఒకేసారి విడుల‌య్యేలా ప్లాన్ చేశాం. డిసెంబ‌ర్ మొద‌టివారంలో ఈ వేడుక‌ను గ్రాండ్ లెవ‌ల్లో పలువురు సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో నిర్వ‌హించ‌నున్నాం. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం`` అన్నారు.

 నటీనటులు

నటీనటులు

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రేయ, క‌బీర్ బేడి త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు.

 టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతంః చిరంత‌న్ ��‌ట్‌, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

English summary
“We are delighted with overwhelming response from Telugu audience for Gautamiputra Satakarni teaser. To carry promotional acceleration until movie release on Jan 12, 2017, we have decided to celebrate our hero Balakrishna’s 100th milestone film by unveiling Gautamiputra Satakarni trailer in 100 theaters at a time in December first week. Venue and other chief guest details are to be announced soon. Trailer will be played simultaneously in 100 locations including the overseas regions USA, UK and other continents” said producers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu