»   » ‘గౌతమీపుత్ర శాతకర్ణి’పై అభిమానుల్లో భారీ అంచనాలు

‘గౌతమీపుత్ర శాతకర్ణి’పై అభిమానుల్లో భారీ అంచనాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్ర‌పంచ సినిమా చ‌రిత్రలో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా ట్రైల‌ర్‌ను 100 థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ సినిమా ప్రీ లుక్‌, ఫ‌స్ట్‌లుక్‌కు ఆడియెన్స్ నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. టీజ‌ర్ ఏకంగా మూడు మిలియ‌న్ వ్యూస్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇప్పుడు చిత్ర థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను భారీగా, విన్నూత‌నంగా విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేశారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని కోటిలింగాలలో ట్రైల‌ర్ విడుద‌ల‌వుతుంది. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి బాల‌కృష్ణ న‌టించిన వందో చిత్రం కావ‌డం, ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా రూపొంద‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.


English summary
For the first time in world cinema history, a film’s trailer will be released in 100 theaters at a time simultaneously. This is the most happening event of Nandamuri Balakrishna’s much awaited 100th film Gautamiputra Satakarni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu