»   » శాతకర్ణి కలెక్షన్ల సునామీ.. చిత్ర యూనిట్‌కు బాలయ్య విందు!

శాతకర్ణి కలెక్షన్ల సునామీ.. చిత్ర యూనిట్‌కు బాలయ్య విందు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం రెండు వారాల తర్వాత కూడా రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. బాలయ్య నటజీవితంలోనే భారీ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డును నెలకొల్పింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలోనూ కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తున్నది. బాలయ్యను తొలిసారి మిలియన్ డాలర్ల క్లబ్బులో చేర్చింది. చిత్ర ప్రమోషన్ కోసం అమెరికాలో పర్యటించి ఇటీవల తిరిగివచ్చారు కూడా.

 Gautamiputra Shatakarni

నందమూరి బాలకృష్ట వందో చిత్రంగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రం తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు, విజయంలో పాలుపంచుకొన్న ప్రతీ ఒక్కరికి బాలయ్య శనివారం హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో విందును ఏర్పాటు చేసినట్టు సమాచారం. ప్రతి ఒక్కరు హాజరుకావాలని కోరినట్టు తెలిసింది.

English summary
Record collections for Balakrishna Movie Gautamiputra Shatakarni
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu