twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబుని ఇమిటేట్ చేస్తూ గౌతమ్ ఫోజు(ఫోటో)

    By Srikanya
    |

    హైదరాబాద్: '1' 'నేనొక్కడినే'లో మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ చిన్నతనంలోని పాత్రను తనయుడు గౌతమ్ పోషించాడు. ఇందులో మహేష్ ఫస్ట్ లుక్ స్టిల్ చాలా బాగా పాపులర్ అయింది. ఇప్పుడు దాన్ని గౌతమ్ ఇమిటేట్ చేస్తున్న ఫోటో ఒకటి బయిటకు వచ్చింది. అచ్చం తండ్రికి నకలు లాగ ఉన్న గౌతమ్...ఇమిటేషన్ చూసిన ముచ్చటపడుతున్నారు. పెద్దయ్యాక మహేష్ కన్నా పెద్ద నటుడు అవుతాడని దీవిస్తున్నారు.

    దర్శకుడు సుకుమార్ గౌతమ్ గురించి మాట్లాడుతూ...గౌతమ్‌ కృష్ణ సైతం తన పాత్రలో చాలా సహజంగా నటించాడు. కొన్నిచోట్ల ఎలా నటిస్తాడో, రియాలిటీ మిస్‌ అవుతుందేమో అని టెన్షన్‌ పడ్డా. ఏ ఇబ్బంది లే కుండా నటించేశాడు. గౌతమ్‌ తండ్రికి తగ్గ తనయుడు.

    ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని మహేష్ బాబు వెల్లడించారు. తాను గౌతమ్ తన పాత్రలో నటిస్తున్న సమయంలో షూటింగ్ లొకేషన్‌కి వెళ్లలేదని చెప్పారు. గౌతం యాక్ట్ చేసే సమయంలో తాను లొకేషన్లో ఉంటే వాడి దృష్టి అంతా తనపైనే ఉంటుందనిపించిందని మహేష్ తెలిపారు. అందుకే ఆ సమయంలో షూటింగ్ లొకేషన్‌కి వెళ్లలేదని చెప్పారు.

    అంతకుముందు గౌతమ్ యాక్ట్ చేయడంపై మాట్లాడుతూ.. '1' షూటింగ్ మొదలైన మూడు నెలలకు గౌతమ్‌తో యాక్ట్ చేయిద్దామని దర్శకుడు సుకుమార్ తనతో అన్నారని తెలిపారు.ఆ తర్వాత తన అసిస్టెంట్‌తో కలిసి సుకుమార్ రెండు మూడు రోజులు తమ ఇంటికొచ్చి గౌతమ్‌తో ఆడుకునే వారని చెప్పారు. గౌతంతో చనువు పెంచుకుంటే ఈజీగా నటింపచేయవచ్చనే ఆలోచనలో వారు ఇలా చేసారని తెలిపారు. సుకుమార్ కోరుకున్న విధంగా గౌతం నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకోగలిగారని మహేష్ బాబు చెప్పారు.

    'దూకుడు' చిత్రం తరువాత మహేష్ బాబు హీరోగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. సంస్థ సుకుమార్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం '1' నేనొక్కడినే.. చిత్రం జనవరి 10న విడుదల అయ్యింది. ఈ చిత్రం మన దేశంతో పాటు జపాన్‌, రష్యా, అమెరికా, కొరియాల్లో ఆయా ప్రాంతీయ భాషల సబ్‌టైటిల్స్‌తో విడుదల కానుంది. మహేష్‌బాబు, కృతిసనన్‌ జంటగా నటించారు. సుకుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ: ఆర్.రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.

    English summary
    The above picture is an unseen working still from the stylish thriller 'ONE'. Mahesh Babu places his two fingers on his forehead in an attempt to make the audience believe his is a person suffering from Integration Disorder.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X