హాట్ టాపిక్: మూడ్రోజులు బెడ్రూంలో అతనితో అనుష్క!

By Bojja Kumar

చెన్నై: తమిళ స్టార్ హీరో అజిత్, అనుష్క కాంబినేషన్లో తమిళంలో ఓ సినిమా రాబోతోంది. ప్రముఖ దర్శకకుడు గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమాలు ఇటీవలే ప్రారంభం అయ్యాయి. రొమాంటిక్ చిత్రాలకు పెట్టింది పేరైన గౌతం మీనన్ ఈ చిత్రంలోనూ రొమాంటిక్ సన్నివేశాలకు పెద్ద పీఠ వేసారు.

ఇందులో భాగంగా ఇటీవల అజిత్-అనుష్క మధ్య బెడ్రూం సన్నివేశాలు చిత్రీకరించారట. ఈ రొమాంటిక్ సీన్లలో భాగంగా ఇద్దరిపై లిప్ లాక్ సీన్లు కూడా షూట్ చేసినట్లు సమాచారం. మూడు రోజుల పాటు కేవలం బెడ్రూం సీన్లే చిత్రీకరించడం ఇపుడు తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

Gautham Menon capturing Ajith - Anushka scene secretly!

ఈ మధ్య అనుష్క సినిమాల్లో బొత్తిగా హాట్ సీన్లు లేకుండా పోయాయి అని నిరాశలో ఉన్న అభిమానులకు ఈ వార్తలు మరింత ఉత్తేజాన్ని ఇస్తున్నాయి. గౌతం మీనన్ సినిమాలు డిఫరెంటుగా ఉంటాయి. రొమాంటిక్ సన్నివేశాలను ఆయన చూపించే తీరు కూడా విభిన్నంగా ఉంటుంది. దీంతో సినిమాపై తమిళనాట ఇప్పటి నుండే అంచనాలు పెరుగుతున్నాయి. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.

అనుష్క ఈ చిత్రంతో పాటు తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' సినిమాతో పాటు....గుణశేఖర్ దర్శకత్వంలో 'రుద్రమదేవి' చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు కూడా పోరాట ప్రధానమైనవే కావడం గమనార్హం. ఈ రెండు సినిమాల మధ్య అజిత్ సరసన అనుష్క రొమాంటిక్ సినిమా చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X