గౌతమ్ మీనన్ స్ట్రైయిట్ తెలుగు చిత్రం ఆ హీరోతో కన్ఫర్మ్
మొత్తానికి రామ్ దశ తిరిగింది. నాగచైతన్యకి 'ఏ మాయ చేసావె' చిత్రంతో విజయాన్ని అందించిన గౌతమ్ మీనన్ తన తదుపరి చిత్రానికి ...రామ్ ని హీరోగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని గౌతమ్ మీనన్ స్వయంగా మీడియాకు సోమవారం రాత్రి హైదరాబాద్ లో ప్రకటించారు. గౌతమ్ మాట్లాడుతూ..."యువతరాన్ని ఆకట్టుకొనే చక్కటి ప్రేమ కథ ఇది. ఈ రోజే రామ్‌తో మాట్లాడాను. ప్రతి ఒక్కరికీ నచ్చేలా తీర్చిదిద్దుతాను. ఎక్కువమంది యువ నటీనటులే ఉంటారు" అన్నారాయన. ఈ సినిమాని మనదేశం మూవీస్ పతాకంపై అశోక్ వల్లభనేని నిర్మిస్తారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తారు అన్నారు. ఇక ప్రస్తుతం రామ్ ని్ర్మత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న కందిరీగ చిత్రం చేస్తున్నారు. అలాగే సమంత, సమీరా రెడ్డి కాంబినేషన్ లో గౌతమ్ మీనన్ రూపొందించిన ఎర్ర గులాబీలు చిత్రం త్వరలో రిలీజుకు రెడీ అవుతోంది.
గౌతమ్ మీనన్ రామ్ నాగ చైతన్య ఏ మాయ చేసావె సమంత gautam menon ram naga chaitanya ye maya chesave samantha


Click it and Unblock the Notifications