కమల్ హాసన్ సినిమా చేసేది షారుఖా, సల్మానా?
కమల్ హాసన్ హీరోగా ఆ మధ్య తెలుగులో 'రాఘవన్' అనే చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో జ్యోతిక, కమలినీ ముఖర్జీ హీరోయిన్లు గా నటించారు. తమిళంలో రూపొందిన 'వెట్టైయాడు విళైయాడు' అనే చిత్రానికి ఇది డబ్బింగ్. ఈ సినిమా తమిళనాడు మంచి విజయం సాధించడంతో ఇదే కథతో హిందీలో రీమేక్ చిత్రం చేయాలనే ఆలోచనకు వచ్చాడు దర్శకుడు గౌతం మీనన్.
ఈ మేరకు ఇందుకు సంబంధించిన కథను బాలీవుడ్ అగ్రహీరోలైన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లకు వివరించారు. ఇద్దరిలో ఎవరు ముందు ఓకే చెబితే వారితో సినిమా చేయాలనేది గౌతం మీనన్ ఆలోచన. అయతే ఇప్పటి వరకు ఇద్దరి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరి ఎవరి నుంచి ముందు గ్రీన్ సిగ్నల్ వస్తుందో చూడాలి.
ప్రస్తుతం గౌతం మీనన్ జీవ-సమంత జంటగా తమిళంలో ఓ సినిమా రూపొందిస్తున్నారు. మరో వైపు షారుఖ్ యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్లో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఇక సల్మాన్ ఈ సంవత్సరం ఎక్తా టైగర్, షేర్ ఖాన్, దబాంగ్2, కిక్ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.


Click it and Unblock the Notifications











