డిసెంబర్‌లో మహేష్ - గౌతమ్ చిత్రం
'ఘర్షణ, రాఘవన్" లాంటి సంచలన చిత్రాల దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, యువ కథానాయకుడు మహేష్ బాబు చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం మహేష్‌బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వరుడు" చిత్రం షూటింగ్‌లో బిజీగా వున్నారు. ఆ చిత్రం తరువాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి మంజుల నిర్మించనున్న చిత్రంలో మహేష్‌బాబు కథానాయకుడుగా నటించడానికి అంగీకరించారు.
ప్రయోగాత్మక చిత్రాలను అత్యున్నత సాంకేతిక విలువలతో అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో సినిమాలను రూపొందించడంలో ఘనాపాటి అనే పేరున్న తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మహేష్‌బాబు ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఒక స్క్రిప్ట్ సిద్ధం చేసి మహేష్‌బాబు సోదరి శ్రీమతి మంజులకు వినిపించడంతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి మంజుల ఆసక్తిగా వున్నారు. ప్రస్తుతం మంజుల ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై నాగార్జున అక్కినేని తనయుడు నాగచైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో నిర్మించే చిత్రం ఇటీవల ప్రారంభించారు. ఆ చిత్రం విడుదల అనంతరం సోదరుడు మహేష్‌బాబుతో డిసెంబర్ నుంచి గౌతమ్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని ప్రారంభించనున్నారు.


Click it and Unblock the Notifications











