»   » 'పోకిరి' డైలాగు... మహేష్ కొడుకు నోటి వెంట (వీడియో)

'పోకిరి' డైలాగు... మహేష్ కొడుకు నోటి వెంట (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: తన తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు చిన్న గిప్ట్ ఇచ్చారు మహేశ్‌బాబు. 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయిపోద్దో... ఆడే పండుగాడు' అన్న తన సినిమా డైలాగ్‌ని జూనియర్‌ ప్రిన్స్‌ గౌతమ్‌తో చెప్పించారు. ఆ డబ్‌స్మాష్‌ వీడియోను మహేశ్‌ తన అధికారిక ట్విట్టర్‌లో అప్‌లోడ్‌ చేసి, అభిమానులకు డబుల్‌ ట్రీట్‌ ఇచ్చారు. ఆ వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక ప్రిన్స్‌ మహేష్‌బాబు నటిస్తున్న 'శ్రీమంతుడు' టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌, మహేశ్‌బాబు నిర్మాణ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో మహేశ్‌బాబు సరసన శృతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తుండగా .. దేవీశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూరుస్తున్నారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన 'శ్రీమంతుడు' టీజర్‌ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

Gautham Nails Pokiri dialogue In Dubsmash Debut

జులై 17న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఓవర్సీస్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్స్, చిత్ర నిర్మాణం పట్ల ఎంతో ఫ్యాషన్ వున్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ (తమ్ముడు), సి.వి.ఎం.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటంతో అభిమానుల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ తొలి చిత్రంగా నిర్మాణవౌతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంగీతం: దేవీశ్రీప్రసాద్, కెమెరా: మది, ఫైట్స్: అనల్‌అరసు, ఆర్ట్: కె.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, నిర్మాతలు: ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కొరటాల శివ.

తాజాగా పూరితో....

" మహేష్ ఫ్యాన్స్ తో ఇది షేర్ చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే మహేష్,నా కాంబినేషన్ లో రూపొందే 3 వ చిత్రానికి స్క్రిప్టు ఫినిష్ చేసాను..హ్యట్రిక్ కు రెడీగా ఉండండి ", అని పూరి జగన్నాథ్ ట్వీట్ చేసారు. మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో త్వరలో ఓ చిత్రం సెట్స్‌పైకి రానుందనే సంగతి తెలిసిందే.

గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన పోకిరి, బిజినెస్‌మేన్ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ సినిమాల తరువాత ముచ్చటగా మూడోసారి వీరి కలయికలో ఓ సినిమా తెరకెక్కనుందని ఈ ట్వీట్ తో ఖరారు చేసారు పూరి.

ఇక ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం చిరంజీవితో పూరి జగన్నాధ్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల అనంతరం వచ్చే ఏడాది మహేష్, పూరి జగన్నాథ్‌ల చిత్రం సెట్స్‌పైకి రానుందని చిత్ర వర్గాల సమాచారం.

English summary
Mahesh tweeted a link to Gautham's dubsmash debut and said, 'I usually don't do this but it's our superstar's birthday..4all the dubsmash fans..enjoy:)'
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu