బాణం దర్శకుడితో బ్రహ్మానందం తనయుడు
దరాబాద్ : నారా రోహిత్‍తో 'బాణం' చిత్రం రూపొందించి మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చైతన్య దొందులూరి. తాజాగా ఈ దర్శకుడు 'బాసంతి' అనే చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇందులో బ్రహ్మానందం తనయుడు గౌతంను హీరోగా ఎంచుకున్నాడు. హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
బాణం చిత్రానికి మంచి టాకే వచ్చినా...బాక్సాఫీసు వద్ద మాత్రం కలెక్షన్లు కురిపించలేక పోయింది. అయితే చైతన్యకు మాత్రం విమర్శకుల ప్రశంసలు అందాయి. గౌతం ఇప్పటికే పలు చిత్రాల్లో నటించినా ఒక్కటి కూడా విజయవంతం కాలేదు. ఆయన చివరగా నటించిన 'పల్లకిలో పెళ్లి కూతురు', 'వారెవా' చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. మరి 'బాసంతి' చిత్రం వీరిద్దరి కెరీన్ ని మలుపు తిప్పుతుందో? లేదో? చూడాలి.
వీర్య దానం, అద్దెగర్భం గురించి చర్చించే కాన్సెప్టుతో రూపొందిన బాలీవుడ్ చిత్రం 'వికీ డోనర్'. విభిన్న కథాంశంతో రూపొందిన ఈచిత్రం పలువురి ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈచిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో గౌతం నటించే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్


Click it and Unblock the Notifications











