twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బసంతి’ ఆడియో విడుదల తేదీ

    By Srikanya
    |

    హైదరాబాద్ : గౌతమ్, అలీషాబేగ్ హీరో హీరోయిన్లుగా స్టార్ట్ కెమెరా పిక్చర్స్ పతాకంపై చైతన్య దంతులూరి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 'బసంతి'. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఈనెల 25న విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శక, నిర్మాత చైతన్య దంతులూరి తెలిపారు. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

    చైతన్య దంతులూరి మాట్లాడుతూ- ''మణిశర్మ స్వరపరిచిన సంగీతం ఓ ప్రధాన ఆకర్షణ. గీత రచయితలు కృష్ణ చైతన్య, శ్రీమణిల సాహిత్యం సంగీత ప్రియులను అలరిస్తుంది. ఈనెల 25న ఆడియోను విడుదల చేస్తున్నాం. చిత్ర విజయంపై మాకు ఎంతో నమ్మకముంది''అని తెలిపారు.

    అలాగే ''బాణం చిత్రానికి ముందే ఈ బసంతి చిత్ర కథ సిద్ధమైంది. సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో నుంచి పుట్టిందే ఈ బసంతి కథ. కళాశాలలో అడ్మిషన్‌ తీసుకోగానే ప్రతి స్టూడెంట్‌కి ఒక గుర్తింపు వస్తుంది. అంతే కాదు కళాశాల బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. అందుకే కళాశాల జీవితం ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైనది. 'బసంతి కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌‌స అండ్‌ సైన్స్‌'లో చదివే విద్యార్థుల కథే ఈ బసంతి. అర్జున్‌గా గౌతమ్‌ విద్యార్థి పాత్రలో కనిపిస్తాడు. చిత్రం షూటింగ్‌ ముగింపు దశలో ఉంది''అన్నారు.

    హీరో గౌతమ్‌ మాట్లాడుతూ ''ఓ మంచి కథ బసంతి. దర్శకుడు కథ చెబుతున్నపుడు ఎంతో ఆసక్తి కలగడంతో పాటు, ఉద్వేగా నికి లోనయ్యాను. నేను పోషిస్తున్న అర్జున్‌ పాత్ర నటుడిగా నిరూపించుకోవడానికి అవకాశం ఉంది. ఈ చిత్రం ద్వారా చాలా నేర్చుకున్నా'' అన్నారు. కాలేజీ నేపథ్యంలో ఉగ్రవాద సమస్యను 'బసంతి'కి కథాంశంగా ఎంచుకున్న చైతన్య దంతులూరి ప్రేక్షకులను ఆకట్టుకునే దిశగా చిత్రాన్ని రూపొందించారని సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు.

    విద్యార్థి పాత్రలో గౌతమ్ కనిపించే ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో తనికెళ్ల భరణి, షాయాజీషిండే, రణధీర్ గట్ల, నవీన జాక్సన్, డా.కె.ఎస్.ఐ.ఆనంద్, ధన్‌రాజ్, మణి కిరణ్, భాను ఆవిర్నేని, దయ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, పాటలు: కృష్ణ చైతన్య, శ్రీమణి, కెమెరా: అనీల్ భండారి, మాటలు: శ్రీకాంత్ విస్సా, నృత్యాలు: రఘు, ఆర్ట్: రఘు కులకర్ణి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల, కథ, కధనం, నిర్మాత, దర్శకత్వం: చైతన్య

    English summary
    Brahmanandam son, Gautham is eagerly waiting to bounce back with success with his upcoming film 'Basanthi'. The shooting part of this film has been completed and currently in post- production work. The film makers are planning to release its audio on Jan., 25th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X