'ఈనాడే ఏదో అయ్యింది' అంటున్న బ్రహ్మానందం కొడుకు
హైదరాబాద్: పల్లకీలో పెళ్లి కూతురు చిత్రంతో పరిచయమైన హీరో గౌతమ్. బ్రహ్మానందం కుమారుడైన గౌతమ్ తర్వాత వారెవా వంటి చిత్రాలు చేసినా భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. దాంతో కెరీర్ ఊహించినంతగా ముందుకు వెళ్లలేదు. అయితే తాజాగా గౌతమ్ హీరోగా 'ఈనాడే ఏదో అయ్యింది'అనే ప్రాజెక్టు ప్రారంభం అవుతోంది. మధుర శ్రీధర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. గతంలో స్నేహగీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ చిత్రాల ద్వారా పరిచయమైన మధుర శ్రీధర్ ఈ ప్రాజెక్టుతో హిట్ కొడతాననే నమ్మకంగా ఉన్నారు.
వీర్య దానం కధాంశంతో హిందీలో వచ్చిన విక్కీ డోనర్ తరహా కథాంసమే ఈ చిత్రం అని తెలుస్తోంది. దానకర్ణ,దానకర్ణుడు అనే టైటిల్స్ ని ఈ చిత్రం కోసం రిజిస్టర్ చేసారు. అయితే అవేమీ కాకుండా ఈ టైటిల్ ని పిక్స్ చేసినట్లుసమాచారం. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుపుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ కు వెళ్లే అవకాశం ఉంది. ఇక తన చిత్రం విక్కీ డోనర్ రీమేక్ లేదా ఫ్రీమేక్ కాదని గతంలో మధురా శ్రీధర్ మీడియాకు తెలియచేసారు.
ఇక ఈ విషయమై మధుర శ్రీధర్ ఓ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ...విక్కీ డోనర్ చూసి నేను ప్రేరణ పొందలేదు. పేపర్లో వచ్చిన స్పెర్మ్ డొనేషన్ మీద వచ్చిన ఓ ఆర్టికల్ చదివి కథ రెడీ చేసుకున్నాను. చెన్నైకి చెందిన ఓ జంట ఆన్ లైన్లో ఐఐటి పాస్ అయిన వ్యక్తి వీర్యం కావాలంటూ ప్రకటన ఇచ్చారు. అది చదివిన దగ్గరనుంచి నేను ఆలోచనలో పడి ఆ పాయింట్ మీద సినిమా చెయ్యాలనుకున్నాను. నా సినిమా ఓ ప్రేమ కథ. సరోగెట్ మదర్ కి,స్పెర్మ్ డొనేటర్ కి మధ్య జరుగుతూంటుంది అని వివరించారు. గతంలో మధుర శ్రీధర్...ఇట్స్ మై లవ్ స్టోరీ,స్నేహ గీతం చిత్రాలు డైరక్ట్ చేసారు. భాక్సాఫీస్ వద్ద ఫలితం ప్రక్కన పెడితే ఈ చిత్రాల ద్వారా చాలా మంది కొత్త వాళ్లు పరిశ్రమకు పరిచయమయ్యారు.


Click it and Unblock the Notifications











