»   » ఖైదీ‌ కలెక్షన్ 1.2 మిలియన్ దాటింది, మరి శాతకర్ణికి ఎంతో తెలుసా?

ఖైదీ‌ కలెక్షన్ 1.2 మిలియన్ దాటింది, మరి శాతకర్ణికి ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెం 150' మూవీ ఓపెనింగ్స్ రికార్డ్ స్థాయిని చేరుకున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ఏలో కూడా ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది.

యూఎస్ఏలో ఈ చిత్రం కేవలం ప్రీమియర్ షోల ద్వారానే 1 మిలయన్ డాలర్ మార్కును అందుకుంది. యూఎస్ఏ వ్యాప్తంగా 157 లొకేషన్లలో ప్రీమియర్ షోలో నిర్వహించగా 1.27 మిలియన్ డాలర్ల(12 లక్షల 70వేల డాలర్లు) అంటే దాదాపు రూ. 8.6 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

Gauthamiputra Satakarni

ఇక బాలయ్య నటించిన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాకు కూడా రెస్పాన్స్ బాగానే వచ్చింది. బాలకృష్ణ గత సినిమాలన్నింటినీ మించిపోయే వసూళ్లు ఈ చిత్రం సాధించింది. 9పీఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈచిత్రాన్ని రెడ్ హార్ట్స్ మూవీస్‌తో కలిసి 4 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.

బుధవారం రాత్రి మొత్తం 110 స్క్రీన్లలో ప్రీమియర్ షోలు వేయగా 3 లక్షల 13 వేల 150 డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. అంటే దాదాపు 2. 13 కోట్లు ప్రీమియర్ షోల ద్వారా వచ్చాయి. బాలయ్య కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ ప్రీమియర్ షో కలెక్షన్. బాలయ్య చివరి సినిమా డిక్టేటర్‌కు ప్రీమియర్ షోల ద్వారా 45వేల డాలర్లు వసూలయ్యాయి.

English summary
Natasimham Nandamuri Balakrishna's historical magnum opus 'Gauthamiputra Satakarni' was premiered in 110 locations across the US yesterday. Trade reports say, the film amassed $313 K through its premiere shows.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu