గాయం సీక్వెల్ లాంటిది ఎవరూ చేయలేదు

By Srikanya

ఇండియాలో ఈ తరహాలో సీక్వెల్ ఎవరూ చేయలేదు. జగపతి బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన 'గాయం' చిత్రానికి పర్‌ఫెక్ట్ సీక్వెల్ ఇది. మా గురువు రాంగోపాలవర్మ చిత్రానికి నేను సీక్వెల్ చేయడం, ఆయన సమర్పణలో ఈ సినిమా తయారవుతుండటం నా అదృష్టం అంటున్నారు దర్శకుడు ప్రవీణ్‌శ్రీ. జగపతి బాబు, విమల రామన్ జంటగా ప్రవీణ్‌శ్రీ దర్శకత్వంలో కర్త క్రియేషన్స్ పతాకంపై డా.ధర్మకర్త సి. నిర్మిస్తున్న 'గాయం-2' చిత్రం రెండో షెడ్యూల్ మే 3 నుంచి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.ఈ విషయాన్ని మీడియా సమావేసం ఏర్పాటు చేసి తెలిపారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా.ధర్మకర్త మాట్లాడుతూ 'ఓ కొత్త స్టైల్‌లో ఉండే యాక్షన్ సినిమా ఇది. రాంగోపాలవర్మ శిష్యుడైన ప్రవీణ్‌శ్రీ ఈ చిత్రాన్ని వినూత్నంగా తెరకు ఎక్కిస్తున్నారు. ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో అయిదు పాటలు ఉన్నాయి. మా కోరిక మేరకు ఇళయరాజా ఓ పాట పాడటం విశేషం' అన్నారు. ఇటీవల బ్యాంకాక్‌లో 20 రోజుల పాటు జరిగిన షూటింగ్‌లో యాక్షన్ ఎపిసోడ్‌తో పాటు జగపతి బాబు, విమల రామన్‌ లపై రెండు పాటలు కూడా చిత్రీకరించారు. ఇక ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం హిస్టరీ ఆఫ్ వయలెన్స్ ఆధారంగా తయారవుతోంది. అందులోని మేజర్ హైలెట్స్ తో కథనం అల్లారని అంతటా వినపడుతున్న సంగతి తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X