పవన్ కళ్యాణ్ పట్టుదల, అక్కయ్యగా టీవీ యాంకర్
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైనా విషయం అనుకున్నారంటే అందుకోసం పట్టుదలగా పని చేస్తారు. ఆయన తాజా సినిమా 'అత్తారింటికి దారేది' చిత్రమే అందుకు నిదర్శనం. ఈ చిత్రాన్ని ఎలాగైనా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు తేవాలనే పట్టుదలతో రాత్రింభవళ్లు కష్టపడుతూ యూనిట్ సభ్యులకు ఆదర్శంగా నిలిచారట పవర్ స్టార్.
ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన శుభం కార్డు సీన్ కూడా పూర్తయింది. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించి పోస్టు ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. టీవీయాంకర్ గాయిత్రి భార్గవి ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సోదరి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈచిత్రాన్ని పూర్తి వినోదాత్మకమైన చిత్రంగా, ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈచిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ మంచి స్పందన వస్తోంది. విడుదలకు ముందే బిజినెస్ పరంగా పలు రికార్డులు నెలకొల్పిన ఈచిత్రం విడుదల తర్వాత ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఖాయం అంటున్నారు.
ఈ చిత్రంలో పవన్ సరసన సమంత, ప్రీణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












