For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డబ్బు కోసం సెక్స్ గురించి పట్టించుకోలేదు.. చివరకు వ్యాధి ఉందని.. గాయత్రి గుప్తా సెన్సేషన్

|
Gayathri Gupta Reveals The Reason Behind Her Rejection By Bigg Boss Management || Filmibeat Telugu

గాయత్రి గుప్తా.. సంచలనాలకు మారు పేరైన ఈమె మరోసారి మీడియాలో హాట్ హాట్ చర్చలకు తెరలేపింది. గతంలో కాస్టింగ్ కౌచ్ పేరుతో అమ్మాయిలను లొంగ దీసుకుంటున్నారని మొదటగా బయటపెట్టిన ఈమె.. ప్రస్తుతం బిగ్ బాస్‌పై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తోంది. బిగ్ బాస్ పేరిట అమ్మాయిలను వంచిస్తున్నారని శ్వేతారెడ్డి చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తూ తన వాయిస్ వినిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గాయత్రి.. బిగ్ బాస్ సీజన్ 2 లో తనకు ఎలా అవకాశం ఇచ్చారు? సెక్స్ గురించి తనతో మాట్లాడిందేంటి? ఆ తర్వాత ఏం జరిగింది? పూర్తి వివరాలు వెల్లడించింది.

కాస్టింగ్ కౌచ్‌తో ఫేం కావడం కారణంగా

కాస్టింగ్ కౌచ్‌తో ఫేం కావడం కారణంగా

తనకు బిగ్ బాస్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని, హిందీ ఒకటి రెండు ఎపిసోడ్స్ చూశాను కానీ తెలుగు అసలు ఒక్క బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా చూడలేదని పేర్కొంది గాయత్రి. అయితే బిగ్ బాస్ సీజన్ 2 సమయంలో తాను కాస్టింగ్ కౌచ్ విషయంలో కొంత ఫేం కావడం కారణంగా బిగ్ బాస్ నిర్వాహకులు తనను అప్రోచ్ అయ్యారని తెలిపింది గాయత్రి. కానీ వాళ్ళు అప్రోజ్ అయ్యాక జీవితంలో ప్రైవసీ అనేది ఉండకపోతే ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలిసిందని చెప్పింది.

డబ్బే కావాలి.. సెక్స్ గురించి అడిగినా పట్టించుకోలేదు

డబ్బే కావాలి.. సెక్స్ గురించి అడిగినా పట్టించుకోలేదు

నన్ను బిగ్ బాస్ లోకి తీసుకోవడానికి 5 సార్లు మీట్ అయ్యారు. ఆ సమయంలో ఎన్నో ప్రశ్నలు వేసి చివరకు బిగ్ బాస్ లోకి తీసుకోలేదని చెప్పింది గాయత్రి గుప్తా. బిగ్ బాస్ వాళ్లు ఆఫర్ చేసిన పేమెంట్ నాకు నచ్చడంతో.. బిగ్ బాస్‌ లో పార్టిసిపేట్ చేయాలని డిసైడ్ అయ్యా. నాకు సినిమాలంటే పిచ్చి కాబట్టి అలా వచ్చిన డబ్బుతో సినిమా తీయొచ్చు అనుకున్నా. అందుకే వాళ్ళు 100 రోజుల పాటు సెక్స్ లేకుండా ఉండగలుగుతారా? అని అడిగినా పట్టించుకోలేదు. పైగా అప్పుడు కాస్టింగ్ కౌచ్ వ్యవహారం నడుస్తోంది కదా. అందుకే అలా అడిగారేమోనని లైట్ తీసుకున్నా.

హెల్త్ ప్రాబ్లమ్స్.. అయినా దానికి ఓకే అన్నాను

హెల్త్ ప్రాబ్లమ్స్.. అయినా దానికి ఓకే అన్నాను

ఆ తరువాత మరో సిట్టింగ్‌లో మీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉందా? అని అడిగారు. ఆటోఇమ్యునిటీ అనేది ఉందని చెప్పా.. బరువులు ఎత్తలేను అని చెప్పాను. ఫిజియోథెరపీ చేయించుకోవాలి.. అయినా ఏం ఫర్వాలేదు. షో చేయడానికి సిద్దమే అని చెప్పాను. దీంతో మరో మీట్‌లో హెచ్‌ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్రిమెంట్ పై సంతకం తీసుకున్నారు. రూల్స్ చెప్పి త్వరలోనే ఫోన్ చేస్తాం. వేరే ప్రాజెక్టులు ఒప్పుకోకండి అని చెప్పారు.. దానికి ఓకే అన్నాను అని గాయత్రి చెప్పింది.

చివరగా సెలెక్ట్ కాలేదన్నారు.. కారణం అడిగితే

చివరగా సెలెక్ట్ కాలేదన్నారు.. కారణం అడిగితే

అగ్రిమెంట్ అయ్యాక రెండు నెలల సమయం గడిచింది. అప్పుడు ఫోన్ చేసి మీరు సెలెక్ట్ కాలేదని చెప్పడంతో ఆశ్చర్యపోయా. కారణం ఏంటని అడిగితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు కదా. అందుకే అన్నారు.హెల్త్ ఇష్యూ ఉందని నేను చెప్పినపుడు మాట్లాడని వాళ్ళు.. రెండు నెలల తరువాత అదే రీజన్ అని చెప్పడం కోపం తెప్పించింది. వెంటనే.. నన్ను బిగ్ బాస్ హౌస్‌కి అయినా తీసుకోండి లేకపోతే అగ్రిమెంట్‌లో ఉన్న అమౌంట్ అయినా ఇవ్వండని గట్టిగా అడిగానని గాయత్రి గుప్తా వెల్లడించింది.

కోర్టుకెళ్లిన గాయత్రి, శ్వేతా.. షో ప్రారంభం కష్టమే!

కోర్టుకెళ్లిన గాయత్రి, శ్వేతా.. షో ప్రారంభం కష్టమే!

బిగ్ బాస్ వివాదంలో నిందితులుగా పేర్కొంటూ రవికాంత్‌, రఘు, అభిషేక్‌, శ్యాం లపై ఇప్పటికే పోలీస్ కేసు నమోదు చేసిన గాయత్రి గుప్తా, శ్వేతా రెడ్డి.. వారికి బెయిల్‌ మంజూరు చేయొద్దంటూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. తాజా పరిణామాలు చూస్తుంటే జులై 21 న బిగ్ బాస్ ప్రారంభం కానుండటం సందేహమే అంటున్నారు కొందరు.

English summary
Bigg Boss season 3 Controversy is going on. In latest Interview Gayathri Gupta says about Bigg Boss agreement with her. Bigg Boss season 3 will starts in july 21st. In this show Nagarjuna will see as Host of Bigg Boss house.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more