‘పవన్ కళ్యాణ్ ఆస్తులు, కార్లు అమ్ముకున్నాడు, చెప్పుతో కొట్టుకోవడం కరెక్టే’

By Bojja Kumar

పవన్ కళ్యాణ్ మీద బూతులు ప్రయోగిస్తూ శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మలుపు తిరిగింది. కాస్టింగ్ కౌచ్ పోరాటం పేరుతో పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరూ ఊరుకోరు అంటూ తెలుగు సినిమా పరిశ్రమతో పాటు పవన్ అభిమానులు, సినీ ప్రియులు భగ్గుమన్నారు. తాజాగా శ్రీరెడ్డి గురించి నటి గాయిత్రి గుప్తా మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు.

పవన్ కళ్యాణ్ దేవుడు అని అందరికీ తెలుసు

పవన్ కళ్యాణ్ దేవుడు అని అందరికీ తెలుసు

పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి పని గురించి ప్రజల కోసం తన హ్యాపీ లైఫ్, కంఫర్టబుల్ జీవితాన్ని వదులుకుని బయటకు వచ్చారు. ఆయన దేవుడు అనే సంగతి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాంటి మనిషిని పట్టుకుని బూతులు తిడతావా? అంటూ గాయిత్రి గుప్తా ఫైర్ అయ్యారు.

 పవన్ కళ్యాణ్ అమ్మగారిని తిట్టడం దారుణం

పవన్ కళ్యాణ్ అమ్మగారిని తిట్టడం దారుణం

సమాజానికి ఎంతో మంది మంచి వాళ్లు అవసరం ఉన్న ఈ పరిస్థితుల్లో మంచి వాళ్లను నాయకులుగా నిల్చోబెడితే రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుంది అని అంతా అనుకుంటున్న సమయంలో ఆ మహానుభావుడిని, పవన్ కళ్యాణ్ అమ్మగారిని దూషిస్తావా? నేను కూడా బూతులు మాట్లాడాను.... కానీ సమయం, సందర్భం, ఎవరిని అంటున్నాం అనేది చూసి మాట్లాడాలి.... అంటూ గాయిత్రి శ్రీరెడ్డిపై ఫైర్ అయ్యారు.

నీ చెప్పుతో నువ్వే కొట్టుకుని మంచి పని చేశావ్

నీ చెప్పుతో నువ్వే కొట్టుకుని మంచి పని చేశావ్

ఆయన పేరు నీ నోట్లో తీసుకునే హక్కు కూడా నీకు లేదు. ‘నిన్ను అన్న అన్నందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాను అన్నావు కదా'... కరెక్ట్ పని చేశావు. ఆయన మాట నీ నోట తీసుకున్నందుకు నీ చెప్పుతో నువ్వు కొట్టుకోవడం చాలా కరెక్ట్. దయచేసి మీడియా వారు అర్హత లేని శ్రీరెడ్డి లాంటి వారికి మైకులు ఇవ్వకండి. వారి ముందు మెరాలు పెట్టకండి.... అంటూ గాయిత్రి గుప్తా సూచించింది.

 ఇండస్ట్రీలో కాంస్టింగ్ కౌచ్ నిజమే, కానీ ఇలా కాదు

ఇండస్ట్రీలో కాంస్టింగ్ కౌచ్ నిజమే, కానీ ఇలా కాదు

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అనేది నిజం. ఉంది కాబట్టే దాని గురించి నేను మాట్లాడాను. దాని గురించి ఏం చేయాలనే ఆలోచిస్తున్నాం, మీటింగులు పెడుతున్నాం. ఈ సమస్య పరిష్కారానకి ఒక పద్దతిలో వెళ్లాలి. శ్రీరెడ్డి ఓసారి కాస్టింగ్ కౌచ్ అంటుంది, మరోసారి పవన్ కళ్యాణ్ అంటూ తిడుతుంది. ఇంకోసారి వ్యభిచారం హక్కు అంటుంది..... ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే క్లారిటీ లేదు. ఇపుడు ఒక సిచ్యువేషన్‌ను లీడ్ చేయడానికి సెన్స్ ఉన్న లీడర్ కావాలి. లీడర్ సరిగా లేనపుడు సమస్య పరిష్కారం కాదు..... అని గాయిత్రి గుప్తా అన్నారు.

 నువ్వు తిట్టిన దానికి అర్థం తెలుసా?

నువ్వు తిట్టిన దానికి అర్థం తెలుసా?

శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ అమ్మను తిట్టిన మాటకు అర్థం తెలుసా? నువ్వు ఆడదాని గురించి పోరాడుతూ అమ్మపై ఈ మాట వాడటం ఎంతవరకు కరెక్ట్? అలాంటి మాటలు మాట్లాడటానికి సందర్భం అనేది లేదా? అర్జున్ రెడ్డి సినిమాలో ఉంది అంటే దానికి ఒక రీజన్ ఉంది..... అని గాయిత్రి తెలిపింది.

పవన్ కళ్యాణ్ చేతకాక కాదు...

పవన్ కళ్యాణ్ చేతకాక కాదు...

పవన్ కళ్యాణ్ గారికి పేషెన్స్ చాలా ఎక్కువ. ఈ మధ్య ప్రతి ఒక్కరూ ఆయన్ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన సైలెంటుగా ఉన్నారంటే చేతకాక కాదు, అర్హత లేని వారికి ఇంపార్టెంట్ ఇవ్వడం ఇష్టం లేక. ఆయన వ్యాల్యూ ఏమిటో ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. బయటి వారికి ఆయన పొలిటికల్ పవర్ లోకి వచ్చిన తర్వాత అర్థం అవుతుందేమో?

 పవన్ తన ఆస్తులు, కార్లు అమ్మేశారు

పవన్ తన ఆస్తులు, కార్లు అమ్మేశారు

పవన్ కళ్యాన్ తన సొంత హ్యాపీనెస్ వదిలేసి, ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఆస్తులు, కార్లు అమ్మేసి ఎలా సహాయం చేస్తారో నాకు తెలుసు. కరణం మల్లేశ్వరికి గవర్నమెంటు కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చి రూ. 10 లక్షలు ఇచ్చారు. మొన్న రాహుల్ వెంకట్ పథకం కొడితే ఫస్ట్ తను పిలిచి 10 లక్షలు ఇస్తే తర్వాత గవర్నమెంట్ పిలిచి ఇచ్చింది.... అని గాయిత్రి గుప్తా తెలిపారు.

తెలుగు వారి పరువు తీశావు

తెలుగు వారి పరువు తీశావు

తెలుగు అమ్మాయివి అయుండి తెలుగువారి పరువు తీయకు, ఇప్పటికే ఇంటర్నేషనల్ మీడియాలో తెలుగునేల పరవు తీశావు. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు.... అంటూ గాయిత్రి గుప్తా శ్రీరెడ్డి సూచించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X