రిపోర్ట్స్ చెక్ చేస్తే ఎయిడ్స్ అని ఉంది, కండోమ్ ఎలా వాడాలో చెప్పా: గాయిత్రి గుప్తా

'ఫిదా' ఫేం గాయిత్రి గుప్తా గతంలో శ్రీరెడ్డి కంటే ముందే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి సంచలనం క్రియట్ చేసిన సంగతి తెలిసిందే. ఏ విషయాన్ని అయినా ఓపెన్‌గా మాట్లాడే గాయిత్రి గుప్తా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

పీరియడ్స్ గురించి, ఎయిడ్స్ గురించి, కండోమ్ వాడకం గురించి ఆమె ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడారు. ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు తాను సిద్ధమే అని తెలిపారు. మరి ఆమె ఏం మాట్లాడారో ఓ లుక్కేద్దాం.

పీరియడ్స్ నేచురల్ ప్రాసెస్

పీరియడ్స్ నేచురల్ ప్రాసెస్

పీరియడ్స్ గురించి నేను చిన్నప్పటి నుంచి ఓపెన్‌గా మాట్లాడతాను. ఎవరికీ జరుగని విషయం నాకు జరిగింది అంటే సీక్రెట్‌గా పెట్టొచ్చు. కానీ అదొక నార్మల్ ప్రాసెస్. అప్పటి వరకు రెగ్యులర్‌గా వచ్చిన పీరియడ్స్ ఆగిపోతే పిల్లలు పుడతారు... అని గాయిత్రి గుప్తా తెలిపారు.

అప్పుడే సమస్య పరిష్కరించగలం

అప్పుడే సమస్య పరిష్కరించగలం

దీని గురించి మాట్లాడొద్దు అంటే ప్రాబ్లమ్స్ డిస్క్రస్ చేయకుండా అయిపోతుంది. సమస్య ఏంటి, ఎలా సఫర్ అవుతున్నామో చెబితేనే అందుకు సంబంధించిన ఏమైనా సమస్య వస్తే పరిష్కరించగలమని గాయిత్రి అభిప్రాయ పడ్డారు.

ఆ సినిమా బాగా నచ్చింది

ఆ సినిమా బాగా నచ్చింది

బాలీవుడ్లో వచ్చిన ప్యాడ్ మ్యాన్ సినిమా నాకు బాగా నచ్చింది. చాలా డీటేల్డ్‌గా తీశారు. ఇలాంటి సినిమాలు అవసరం. అన్ హైజీన్ వల్ల పెద్ద పెద్ద డిసీజెస్ వస్తాయి. దీని వల్ల చనిపోయిన కేసులు చాలా ఉన్నాయని తెలిపారు.

కండోమ్ ఎలా వాడాలో చెప్పాను

కండోమ్ ఎలా వాడాలో చెప్పాను

పీరియడ్స్ మాత్రమే కాదు బర్త్ కంట్రోల్ మీద కూడా అవగాహన కలిగించాలి. నేను ఇంతకు ముందు ఉండే చోట వాచ్ మెన్ ఫ్యామిలీకి పిల్లలు పుడుతూనే ఉన్నారు. ఎప్పుడూ చూసినా వాళ్ల ఆవిడ ప్రెగ్నెంటుగా ఉంటుంది. నేను ఈ విషయమై అడిగితే ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పింది. ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఉమెన్ హెల్త్ నాశనం అవుతుందని చెప్పి... నా ఫ్రెండ్‌ను మెడికల్ షాపుకు పంపి కండోమ్స్ తీసుకొచ్చి వాటిని ఎలా వాడాలో చెబితే... వాళ్లేమో సిగ్గుపడతారు. ఈ విషయాన్ని చెప్పడానికి ఇన్ని సమస్యలు ఉన్నాయి.

రిపోర్ట్స్ చెక్ చేస్తే ఎయిడ్స్ అని తెలిసింది

రిపోర్ట్స్ చెక్ చేస్తే ఎయిడ్స్ అని తెలిసింది

వాచ్‌మెన్ పాదర్ ఎయిడ్స్ వచ్చి చనిపోయాడు. ఏమైంది ఎలా చనిపోయాడు అంటే తెలియదన్నారు. రిపోర్ట్స్ తీసుకుని చూస్తే బాడీలో అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి. ఎయిడ్స్ వల్లే ఇలా అయిందని చెప్పాను. అప్పటికే వాళ్ల వైఫ్ చనిపోయింది. చుట్టుపక్కల ఉన్న చాలా మందితో అతడికి సంబంధాలున్నాయి. అతడి వల్ల చాలా మందికి ఇది స్ప్రెడ్ అయింది ఎవేన్‌నెస్ లేదు. ఇలాంటి వాటిపై అవేర్‌నెస్ తేవడానికి ఏమైనా కార్యక్రమాలు చేస్తే నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను. దీనికి నేను ఎలాంటి డబ్బులు కూడా తీసుకోను... అని గాయిత్రి గుప్తా తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X