For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  12 డేస్ దానికి కమిటైతే ప్లాట్, కారు, 10 లక్షల క్యాష్ ఇస్తామన్నారు: ‘ఫిదా’ గాయిత్రి

  By Bojja Kumar
  |
  దానికి కమిటైతే అన్నీ ఇస్తామన్నారు.. -‘ఫిదా’ గాయిత్రి

  'ఫిదా' సినిమాతో పాపులర్ అయిన నటి గాయిత్రి గుప్తా. ఈ చిత్రంలో హీరోయిన్ సాయి పల్లవి ఫ్రెండ్ పాత్ర పోషించిన నటి గాయిత్రి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌లో ఇంటర్వ్యూలో టాలీవుడ్ గురించి, ఇండస్ట్రీలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ విషయాల గురించి ధైర్యంగా బయట పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ టీవీ ఛానల్ 'కాస్టింగ్ కౌచ్' అంశం గురించి నిర్వహించిన చర్చా కార్యక్రమంలో గాయిత్రి గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తనకు ఎదురైన అనుభాలను వివరించారు.

  అందుకే ధైర్యంగా మాట్లాడుతున్నా

  అందుకే ధైర్యంగా మాట్లాడుతున్నా

  ఇలాంటి సమస్యలు రావడానికి ఇండస్ట్రీ అనే కాదు, ఎక్కడైనా ఆస్కారం ఉంది. అమ్మాయిలు ఎవరికీ లొంగకుండా ధైర్యంగా ముందుకు సాగితే ‘కాస్టింగ్ కౌచ్' లాంటివి అరికట్టవచ్చు. ఆడదాన్ని, మగవాన్ని ఈక్వెల్ గా చూస్తున్న ప్రపంచం ఇది. మన లైఫ్ మన కంట్రోల్ లో ఉండాలి. అందుకే ఇలాంటివి ఎదురైనపుడు వాటి గురించి మాట్లాడటమే కరెక్ట్ అని నా ఫీలింగ్ అని గాయిత్రి గుప్తా తెలిపారు.

  కమిట్మెంటుకు ప్రిపేర్ అయి ఉన్నావా? అని ముందే అడుగుతారు

  కమిట్మెంటుకు ప్రిపేర్ అయి ఉన్నావా? అని ముందే అడుగుతారు

  సినిమా నిర్మాత, డైరెక్టర్, ఆర్టిస్టులు కాకుండా మేనేజర్స్ లెవల్లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. వాళ్లు మనల్ని ఒక సినిమా కోసం సంప్రదించినపుడు కమిట్మెంటుకు (పడుకోవడానికి) ప్రిపేర్ అయి ఉన్నావా? లేదా? అని ముందే ఎలాంటి మొహమాటం లేకుండా అడిగేస్తారు.... అని గాయిత్రి గుప్తా తెలిపారు.

  పడుకోవడం అర్హత ఎలా అవుతుంది?

  పడుకోవడం అర్హత ఎలా అవుతుంది?

  మూవీ అనేది ఒక కళ. సినిమాల్లో అవకాశం ఇవ్వాలంటే నీకు యాక్టింగ్ టాలెంట్ ఉందా? సింగింగ్ టాలెంట్ ఉందా? డాన్సింగ్ టాలెంట్ ఉందా? అని చూడాలి. కానీ అది(పడుకోవడం) దానికి అర్హత ఎలా అవుతుంది? దానికోసం ఒక సెక్టర్ ఉంది కదా? అంటూ..... గాయిత్రి గుప్తా ప్రశ్నించారు.

  అందరూ అలాంటివారు కాదు

  అందరూ అలాంటివారు కాదు

  అందరూ అలా ఉన్నారని అనడం లేదు. నేను ఇప్పటి వరకు 11 సినిమాలు చేశాను. అందులో హిట్టయిన మూవీ ‘ఫిదా'. ఇండస్ట్రీలో అలాంటి వారు కొంత మంది అయితే ఉన్నారు. ఆ కొంత మంది కూడా ఆడ పిల్ల తన పరువు కోసం బయటకు మాట్లాడదు కదా అనే ఉద్దేశ్యంతో ఇలాంటివి చేస్తుంటారు. ఇది ఎక్కడైనా జరుగుతుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటుంది అని గాయిత్రి గుప్తా తెలిపారు.

  అందుకే ఇండస్ట్రీలో ఎక్కువ...

  అందుకే ఇండస్ట్రీలో ఎక్కువ...

  సినిమా ఇండస్ట్రీ అనేది అన్ ఆర్గనైజ్డ్ సెక్టర్. ఇక్కడ అలాంటి సంఘటనలు ఎదురైతే ఎవరికి కంప్లయింట్ చేయాలో కూడా చాలా మందికి తెలియదు. ఇండస్ట్రీ గురించి తెలియక చాలా మంది దీనిలో ఇరుక్కుంటారు. ఒకసారి తప్పుచేయడం మొదలైతే లైఫ్ స్పాయిల్ అవుతుంది. చాలా మందిని చూశాను. వారు ఇష్టంతో చేయరు. తెలియక చేసి అందులో పడిపోతుంటారు... అని గాయిత్రి గుప్తా తెలిపారు.

  12 డేస్ కమిటైతే ప్లాట్, కారు, 10 లక్షల క్యాష్ ఇస్తామన్నారు

  12 డేస్ కమిటైతే ప్లాట్, కారు, 10 లక్షల క్యాష్ ఇస్తామన్నారు

  రెండు సంవత్సరాల క్రితం నాకు ఓ బాలీవుడ్ మూవీ ఆఫర్ కూడా వచ్చింది. మంచి క్యారెక్టర్. 12 రోజులు కమిట్మెంట్ ఇస్తే ఒక ప్లాట్ గిఫ్ట్ ఇస్తాను, ఒక కారు కొనిస్తాను, 10 లక్షల పేమెంట్ ఇస్తామని చెప్పారు. దీంతో నాకు ఈ ఆఫర్ వద్దని చెప్పి వచ్చేశాను... అని గాయిత్రి గుప్తా తెలిపారు.

  అప్పటి నుండి మేనేజర్స్‌ను కలవడం మానేశాను

  అప్పటి నుండి మేనేజర్స్‌ను కలవడం మానేశాను

  12 డేస్ కమిట్మెంట్ అంటే ఏమిటి? 12 రోజులు నటించడమా? అని యాంకర్ ప్రశ్నించగా.... కమిట్మెంట్ అంటే 12 రోజులు వారితో పడుకోవాలి అని గాయిత్రి గుప్తా తెలిపారు. అప్పటి నుండి మేనేజర్స్‌ను కలవడం మానేశాను అని గాయిత్రి గుప్తా తెలిపారు.

  రేప్ ఎటాక్ జరిగింది, 5 బ్రేకప్స్, ఐటం అన్నారు, నైట్‌కు ఇంత అని రేటుకట్టారు: 'ఫిదా' ఫేం గాయిత్రి

  పడుకుంటేనే ఛాన్స్... నేనేమైనా వేశ్యనా? ఆ లేడీస్ వల్లే ఈ దుస్థితి: 'ఫిదా' ఫేం గాయిత్రి

  English summary
  Fidaa Fame Gayatri Gupta shared her experiences in movies and sexual harassment of producers and directors to get a movie chance. Gayatri revealed many shocking and unknown facts about Tollywood Industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X