విష్ణు చాలా మారిపోయాడే.. శ్రియకు జడవేస్తూ... గాయత్రి హోమ్లీలుక్!

By Rajababu

విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం గాయత్రి. ఈ చిత్రంలో విష్ణు మంచు ఓ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సరసన మొదటిసారి శ్రియ నటిస్తుండటం మరో విశేషం. తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా విష్ణు, శ్రియలు కలిసున్న ఓ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

 పవర్‌ఫుల్‌గా మోహన్‌బాబు

పవర్‌ఫుల్‌గా మోహన్‌బాబు

క్రిస్మస్ కు విడుదల చేసిన గాయత్రి ఫస్ట్ లుక్ పోస్టర్ లో మోహన్ బాబు పవర్‌ఫుల్ లుక్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో విష్ణు, శ్రియలు ముచ్చటైన జంటగా కనువిందు చేస్తున్న పోస్టర్ కు కూడా మంచి స్పందన వస్తుంది.

 యాక్షన్, ఫ్యామిలీ స్టోరీ

యాక్షన్, ఫ్యామిలీ స్టోరీ

గాయత్రి పోస్టర్లను బట్టి గాయత్రి చిత్రంలో మాస్ యాక్షన్ తోపాటు మంచి కుటుంబ కథ కూడా ఉంటుందని అర్ధమవుతుంది. మదన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూర్చారు.

 ఫిబ్రవరి 9న విడుదల

ఫిబ్రవరి 9న విడుదల

అనసూయ భరద్వాజ్, నిఖిల విమల్ మరియు బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 9 న మన ముందుకు రాబోతున్న గాయత్రీ చిత్రాన్ని డా.యమ్.మోహన్ బాబు తన ప్రతిష్టాత్మక బ్యానర్ అయిన శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పై నిర్మించగా అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు.

 సాంకేతిక విభాగంలో

సాంకేతిక విభాగంలో

సాంకేతిక వర్గం: సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయాగ్రహం: సర్వేశ్ మురారి,
ఆర్ట్: చిన్న, ఎడిటర్: ఎంఆర్ వర్మ, ఫైట్స్: కనల్ కణ్ణన్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య. కో-డైరెక్టర్స్: అనిల్ కుమార్ కె.వి.ఎస్.ఎన్, గుణ నాగేంద్ర ప్రసాద్, రవి బయ్యవరపు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయకుమార్.ఆర్
నిర్మాత: డా. మోహన్ బాబు యమ్, దర్శకత్వం: మదన్ రామిగాని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X