మోహన్ బాబు నట విశ్వరూపం.....(‘గాయిత్రి’ ట్రైలర్)

By Bojja Kumar

Recommended Video

మోహన్ బాబు నట విశ్వరూపం...‘గాయిత్రి’ ట్రైలర్

మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'గాయిత్రి'. మదన్‌ రామిగాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ ఆదివారం విడుదలైంది. ఈ సినిమా ద్వారా మోహన్ బాబు తన నట విశ్వరూపం చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

డైలాగ్స్ అదుర్స్

డైలాగ్స్ అదుర్స్

‘రామాయణం ఒక ఆడదాని ఏడుపు వల్ల జరిగింది.. భారతం ఒక ఆడదాని నవ్వు వల్ల జరిగింది', ‘అది వదలే రకం కాదు.. నేను దొరికే రకం కాదు', ‘అక్షరాలు లేని స్వచ్ఛమైన భాష నవ్వు', ‘ప్రాణం ఇచ్చే పంచభూతాలు రెండో పేజీ ఓపెన్‌ చేస్తే ప్రళయ తాండవమే వస్తుంది', ‘ఈ గాయత్రి పటేల్‌ ప్రతీ పేజీ క్రైం పేజీరా', ‘దేవుడు చాలా మంచి వాడు రాక్షసులకు కూడా వరాలు ఇస్తుంటాడు' అంటూ మోహన్‌బాబు చెబుతున్న డైలాగ్స్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.

పవర్ ఫుల్ క్యారెక్టర్

పవర్ ఫుల్ క్యారెక్టర్

మోహన్ బాబు కెరీర్లో పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి చిత్రాలు ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రాలు. ఆ సినిమాల స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ‘గాయిత్రి' సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

మంచు విష్ణు

మంచు విష్ణు

'గాయత్రి' చిత్రంలో మోహన్ బాబు తనయుడు విష్ణు మంచు కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. విష్ణుకు జోడిగా హీరోయిన్ శ్రియ నటిస్తోంది.

జర్నలిస్టుగా అనసూయ

జర్నలిస్టుగా అనసూయ

‘గాయిత్రి' చిత్రంలో అనసూయ ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల చేశారు. లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ చిత్రంలో ఆమె పవర ఫుల్ జర్నలిస్టుగా కనిపించనుంది.

తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదుర్స్

తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదుర్స్

ట్రైలర్ పరిశీలిస్తే తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహం: సర్వేశ్ మురారి, ఆర్ట్: చిన్న, ఎడిటర్: ఎంఆర్ వర్మ, ఫైట్స్: కనల్ కణ్ణన్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య. కో-డైరెక్టర్స్: అనిల్ కుమార్, కె.వి.ఎస్.ఎన్, గుణ నాగేంద్ర ప్రసాద్, రవి బయ్యవరపు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయకుమార్.

ఫిబ్రవరి 9న గ్రాండ్ రిలీజ్

ఫిబ్రవరి 9 ను విడుదల తేదీగా ఖరారు చేసిన 'గాయత్రి' చిత్రాన్ని మోహన్ బాబు తమ సొంత బేనర్ 'శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్'పై నిర్మిస్తుండగా అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X